ఆనంద్ మహీంద్ర రెస్పాన్స్ : వరద నీటిలో ఆగిన జాగర్.. దూసుకెళ్లిన బొలేరో

అపర కుబేరులు అమితంగా ఇష్టపడి కొనే లగ్జరీ కారు జాగర్ కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

  • Published By: sreehari ,Published On : September 7, 2019 / 08:01 AM IST
ఆనంద్ మహీంద్ర రెస్పాన్స్ : వరద నీటిలో ఆగిన జాగర్.. దూసుకెళ్లిన బొలేరో

అపర కుబేరులు అమితంగా ఇష్టపడి కొనే లగ్జరీ కారు జాగర్ కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

అపర కుబేరులు అమితంగా ఇష్టపడి కొనే లగ్జరీ కారు జాగర్ కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బ్రిటన్ కంపెనీ బ్రాండ్ లగ్జరీ కార్లలో ఎంతో పాపులర్ అయిన జాగర్ కారు ముంబై వరదనీటిలో ఆగిపోయింది. ముందుకు వెళ్లలేక అక్కడే నిలిచింది. కానీ, మేడిన్ ఇండియా కారు.. మహీంద్ర బొలేరో SUV కారు మాత్రం తన పవర్ చూపించింది. ఇండియా ఇంజిన్ పవర్ ఇదే అంటూ వరదనీటిలోనూ రయ్ మంటూ ముందుకు దూసుకెళ్లింది.

దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొన్నిరోజులుగా ముంబైలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడ చూసినా రోడ్లన్నీ వరదనీటిలో నిండిపోయాయి. సముద్రాన్ని తలపించేలా ఉన్నాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నేవీ ముంబైలోని అయిరోలి ప్రాంతంలో ఓ బ్రిడ్జి కింద వరద నీరు నిలిచిపోయింది. ఆ మార్గంలో వాహనాలు నిలిచిపోయాయి. 

ఇంతలో ముందుకు దూసుకొచ్చిన జాగర్.. లగ్జరీ కారు మాత్రం వరద నీటిని తోసుకుంటూ ముందుకు వెళ్లింది. కానీ, మధ్యలోనే చతికలపడింది. వెనుక నుంచి దూసుకొచ్చిన మహీంద్రా బొలేరో కారు మాత్రం.. వరద నీటిని తోసుకుంటూ ముందుకు సాగింది. జాగర్ కారును దాటేసి ముందుకు దూసుకెళ్లింది. ఎంతో ఖరీదైన జాగర్ కారు ఇలా నీటిలో ఆగిపోవడంపై సోసల్ మీడియా వేదికగా నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. సబ్ మెరైన్ లో కూడా అత్యంత శక్తివంతంగా దూసుకెళ్లగల సామర్థ్యం బొలేరో కారుకు ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎలాంటి మార్గాల్లోనైనా వెళ్లే కేపాసిటీ బొలేరా వాహనాలకు ఉందంటూ ట్వీట్లు చేస్తున్నారు. 

బొలేరో కారు నీటిలో దూసుకెళ్లే వీడియోపై మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా స్పందించారు. ‘ఇది తగిన పోటీ కానే కాదు. మేము దీని గురించి గొప్పగా చెప్పుకోలేం. బొలేరో కారు సామర్థ్యాన్ని ఇలాంటి సందర్భాల్లో చర్చించేందుకు ఉద్దేశించినది కాదు’ అని తనదైన శైలిలో ఆయన ట్వీట్ చేశారు. కొందరు నెటిజన్లు మాత్రం బొలేరో కారుకు జాగర్ కారుకు ముడి పెడుతూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.