Bharat Jodo Yatra: రాహుల్‌తో బాలీవుడ్ నటి .. జమ్మూలో భారీ భద్రత నడుమ భారత్ జోడో యాత్ర ..

భారత్ జోడో యాత్రలో పాల్గొనేకంటే ముందు ఉర్మిళ తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియోను పోస్టు చేశారు. వణుకుతున్న చలిలో మీతో మాట్లాడుతున్నాను.. మరికొద్దిసేపట్లో రాహుల్ గాంధీ వెంట భారత్ జోడో యాత్రలో పాల్గొనబోతున్నానని ఆమె తెలిపింది.

Bharat Jodo Yatra: రాహుల్‌తో బాలీవుడ్ నటి .. జమ్మూలో భారీ భద్రత నడుమ భారత్ జోడో యాత్ర ..

Bharat Jodo Yatra

Bharat Jodo Yatra: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జమ్మూ కశ్మీర్‌లో కొనసాగుతోంది. మంగళవారం ఉదయం జమ్మూలోని నగ్రోటా పట్టణం నుంచి రాహుల్ తన పాదయాత్రను ప్రారంభించారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ యాత్ర కొనసాగుతోంది. ఉదయం 8గంటల సమయంలో ఆర్మీ క్యాంపు వద్ద బాలీవుడ్ సీనియన్ నటి, రాజకీయ నాయకురాలు ఉర్మిళ మటోండ్కర్ రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. ఉర్మిల క్రీమ్ కలర్ సంప్రదాయ కశ్మీర్ ఫెరాన్, తలకు క్యాప్ ధరించి యాత్రలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Bharat Jodo Yatra: జమ్ముకశ్మీర్‌లో భారీ భద్రత మధ్య రాహుల్ భారత్ జోడో యాత్ర ..

భారత్ జోడో యాత్రలో పాల్గొనేకంటే ముందు ఉర్మిళ తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియోను పోస్టు చేశారు. వణుకుతున్న చలిలో మీతో మాట్లాడుతున్నాను.. మరికొద్దిసేపట్లో రాహుల్ గాంధీ వెంట భారత్ జోడో యాత్రలో పాల్గొనబోతున్నానని ఆమె తెలిపింది. ఈ యాత్రకు రాజకీయాల కంటే సామాజిక ప్రాధాన్యత ఎక్కువ అని అన్నారు. ఈ ప్రయాణంలో ప్రేమ, ఆప్యాయత, విశ్వాసం, భారతీయత ఉట్టపడుతున్నాయని, భారతీయత మనందరిని ఒకచోటుకు చేర్చుతుందని తెలిపారు. ఈ భారతీయత అనే దీపం మనందరి హృదయాల్లో వెలుగుతూ ఉంటుందని, అది చిరస్థాయిగా నిలిచి, వెలుగుతూనే ఉండాలని పేర్కొంటూ చివరిలో జై భారత్ జైహింద్ అనే నినాదంతో ముగించారు.

ఉర్మిళ మటోండ్కర్ 2019 సెప్టెంబర్ లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆరు నెలల తరువాత కాంగ్రెస్ కు రాజీనామా చేసి 2020లో శివసేన లోచేరారు. రాహుల్ వెంట గంటకుపైగా ఆమె భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఇప్పటికే సినీ రంగానికి చెందిన పలువురు నటీనటులు పాల్గొని తమ సంఘీభావం తెలుపుతూ రాహుల్ వెంట నడిచారు. వీరిలో పూనమ్ కౌర్, రియా సేన్, రష్మీ దేశాయ్, పూజా భట్, అమోల్ పాలేకర్ తదితరులు రాహుల్ వెంట యాత్రలో పాల్గొన్నారు. ఇదిలాఉంటే.. భారత్ జోడో యాత్ర జమ్మూ కశ్మీర్లో కొనసాగుతున్న నేపథ్యంలో యాత్రకు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.