Aryan Khan : ఆర్యన్‌ఖాన్‌కు బెయిల్‌ వచ్చేనా..?

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్‌ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ మరోసారి విచారణ జరగనుంది. ముంబైలోని ప్రత్యేక ఎన్డీపీఎస్‌ కోర్టు బెయిల్‌ ఇవ్వడానికి నిరాకరించింది.

10TV Telugu News

Mumbai Cruise Ship Drugs Case : బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్‌ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ మరోసారి విచారణ జరగనుంది.ఈనెల 20న విచారణ జరిపిన ముంబైలోని ప్రత్యేక ఎన్డీపీఎస్‌ కోర్టు ఆర్యన్‌ఖాన్‌కు బెయిల్‌ ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో అతని తరఫు లాయర్‌ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారిస్తామని బాంబే హైకోర్టు తెలిపింది. దీంతో ఆర్యన్‌ఖాన్‌కు బెయిల్‌ వస్తుందా.. రాదా.. అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

అక్టోబర్‌ 2 ఆర్యన్‌ఖాన్‌ డ్రగ్స్‌ కేసులో చిక్కుకున్నాడు. తన స్నేహితులతో కలిసి క్రూయిజ్ షిప్ లో రేవ్ పార్టీ నిర్వహిస్తూ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు పట్టుబడ్డాడు. రేవ్ పార్టీలో ఆర్యన్ ఖాన్ నిషేదిత డ్రగ్స్ వాడుతున్నట్లు ఎన్సీబీ అధికారులకు సమాచారం అందడంతో రైడ్ నిర్వహించారు. ఈ రైడ్‌లో NCB అధికారులు ఆర్యన్‌ఖాన్‌తో పాటు మరికొందరిని అరెస్ట్ చేశారు. అక్టోబర్ 7న కోర్టు ఆర్యన్ ఖాన్‌ని జ్యూడిషియల్ కస్టడీకి తరలించింది.

Aryan Khan : 15 ఏళ్లకే డ్రగ్స్ తీసుకున్నా..ఆర్యన్ ఖాన్ పిల్లోడు – సోమీ ఆలీ

షారుఖ్ తన కుమారుడి కోసం బెయిల్‌కి తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ కోర్టులో మాత్రం చిక్కెదురవుతోంది. ఇప్పటివరకు మూడుసార్లు కోర్టులో ఆర్యన్‌ఖాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మెజిస్ట్రేట్‌ కోర్టు రెండు సార్లు, ప్రత్యేక ఎన్డీపీఎస్‌ కోర్టు ఒకసారి బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించాయి. దీంతో బాంబే హైకోర్టు మెట్లెక్కారు ఆర్యన్‌ఖాన్‌ కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ఆర్యన్‌ఖాన్‌ ఆర్థర్‌రాడ్‌ జైల్లో ఉన్నాడు.