13వ యేట గ్రేనైడ్ పేలుడులో చావు తప్పించుకుంది, ఒక్క వేలుతోనే PHD చేసింది. మాళవిక ఉత్తేజకరమైన కథ ఇది..

పట్టుదల, సంకల్పం ఉండాలే కానీ.. సాధించలేనిది ఏదీ లేదు. వైకల్యం కూడా తల వంచాల్సిందే. దీనికి మాళవిక అయ్యార్ నిలువెత్తు నిదర్శనం. ఓ బాంబు బ్లాస్ట్ లో రెండు చేతులూ

  • Published By: veegamteam ,Published On : February 20, 2020 / 08:12 AM IST
13వ యేట గ్రేనైడ్ పేలుడులో చావు తప్పించుకుంది, ఒక్క వేలుతోనే PHD చేసింది. మాళవిక ఉత్తేజకరమైన కథ ఇది..

పట్టుదల, సంకల్పం ఉండాలే కానీ.. సాధించలేనిది ఏదీ లేదు. వైకల్యం కూడా తల వంచాల్సిందే. దీనికి మాళవిక అయ్యార్ నిలువెత్తు నిదర్శనం. ఓ బాంబు బ్లాస్ట్ లో రెండు చేతులూ

పట్టుదల, సంకల్పం ఉండాలే కానీ.. సాధించలేనిది ఏదీ లేదు. వైకల్యం కూడా తల వంచాల్సిందే. దీనికి మాళవిక అయ్యార్ నిలువెత్తు నిదర్శనం. ఓ బాంబు బ్లాస్ట్ లో రెండు చేతులూ కోల్పోయినా.. ఆమె జీవితంలో నిరుత్సాహ పడలేదు. ఏమీ చేయలేనని కుంగిపోలేదు. బాధపడుతూ ఇంట్లో ఓ మూలన పడలేదు. దేవుడా.. నాకెందుకీ శిక్ష అంటూ నిందిస్తూ కూర్చోలేదు. మరింత కసిగా పోరాటం చేసింది. పట్టుదలగా ప్రయత్నం చేసింది. అనుకున్నది సాధించింది. తన జీవిత కల నెరవేర్చుకుంది. పీహెచ్ డీ థీసిస్ రాసింది. ఆమే మాళవిక అయ్యర్(malavika iyer).

13 ఏళ్ల వయసులో రెండు చేతులూ కోల్పోయిన మాళవిక అయ్యర్ జీవితం అందరికి ఆదర్శం. ఆమె పోరాటం స్ఫూర్తిదాయకం. మాళవిక అయ్యర్ నేషనల్ అవార్డ్ విన్నర్. అంతర్జాతీయ మోటివేషనల్ స్పీకర్. అంతేకాదు వైకల్యం హక్కుల కార్యకర్త కూడా. ఫిబ్రవరి 18న మాళవిక పుట్టిన రోజు జరుపుకుంది. ఈ సందర్భంగా అమెరికాలో స్పీచ్ ఇచ్చింది. దీనికి సంబంధించి మాళవిక తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది. పీహెచ్ డీ థీసిస్ రాయడం చాలా సంతోషంగా ఉందని చెప్పింది.

బాంబు బ్లాస్ట్ లో తీవ్రంగా గాయపడటం, ఆ తర్వాత డాక్టర్లు చేసిన సర్జరీ గురించి మాళవిక గుర్తు చేసుకుంది. సర్జరీ సమయంలో చిన్న పొరపాటు జరిగింది. కుడి చేతికి డాక్టర్లు కుట్లు వేయడం మర్చిపోయారు. దీంతో ఓ ఎముక అలాగే ఉండిపోయింది. దానిపై చర్మం కానీ మాంసం కానీ లేదు. దీంతో ఎప్పుడైనా అక్కడ దెబ్బ తాకితే విపరీతమైన నొప్పి కలిగేదని మాళవిక చెప్పింది. డాక్టర్లు చేసిన ఆ పొరపాటే, ఆ ఎముకే ఇప్పుడు తనకు కలిసి వచ్చిందని మాళవిక అయ్యార్ చెప్పింది. ఆ ఎముకే తన వేలు అయిందన్నారు. ఆ extraordinary finger ద్వారానే ఇప్పుడు పీహెచ్ డీ థీసిస్ రాయగలిగానని మాళవిక తెలిపింది. 

ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హ్యాపీ బర్త్ డే విషెస్ చెప్పారు. అంతేకాదు యు ఆర్ గ్రేట్ అంటూ ప్రశంసించారు. మీ జీవితం అందరికి ఆదర్శం అని కొనియాడారు. మీరు రియల్ హీరో అని కితాబిచ్చారు. నిరాశ, నిస్పృహలో కూరుకుపోయిన వారికి మీరు స్ఫూర్తిదాత అన్నారు. సంకల్పం ముందు వైకల్యం కూడా ఓడిపోతుందని నిరూపించడానికి మాళవిక అయ్యర్ నిలువెత్తు నిదర్శనం. కాళ్లు, చేతులు అన్నీ బాగున్నా.. జీవితంలో ఏదో కోల్పోయినట్టు.. నిరాశ, నిస్పృహలో పడిపోయిన వారు.. మాళవిక అయ్యర్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మాళవిక అయ్యర్ గురించి తెలిశాక మార్పు రావడం ఖాయం అని నెటిజన్లు అంటున్నారు.

Read More>>చిత్తూరు అడవుల్లో గుప్త నిధుల కోసం నరబలికి యత్నం : బైటపడుతున్నకొత్తకోణాలు..!!