శ్రీలంకలో పేలుళ్లు : గోవాలో హై అలర్ట్ 

  • Published By: veegamteam ,Published On : April 22, 2019 / 04:30 AM IST
శ్రీలంకలో పేలుళ్లు : గోవాలో హై అలర్ట్ 

ఈస్టర్ పండుగలో శ్రీలంక రక్తసిక్తంగా మారిపోయింది. జీసస్ ప్రార్థనలు వినపడాల్సిన సమయంలో ఆర్తనాదాలు వినిపించాయి. ఏప్రిల్ 21న శ్రీలంకలో ఎనిమిది బాంబు దాడులు సంభవించాయి. ఈ ఘోర ఘటనలో వందలాది ప్రాణాలు గాల్లో కలిసిపోగా..లెక్కలేనంతమంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో దేశ వ్యాప్తంగా భయాందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో భారత దేశంలోని గోవా రాష్ట్రంలో  నేపథ్యంలో గోవా రాష్ట్రంలో హైఅలర్ట్ ప్రకటించారు. 
Also Read : శ్రీలంక భీతావహం : ఆరుగురు భారతీయుల మృతి

ముఖ్యంగా గోవాలోని చర్చ్‌ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ముందస్తు జాగ్రత్తలలో భాగంగా గోవా ప్రభుత్వం పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. గోవా సీఎం సావంత్ శ్రీలంక ఉగ్రదాడిని ఖండించిన అనంతరం గోవాలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని డీజీపీ ప్రణబ్ నందాను ఆదేశించారు. దీంతో చర్చ్ లలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. గోవా, డామన్ చర్చ్ ల ఆర్చి బిషప్ లతో డీజీపీ ప్రణబ్ నందా మాట్లాడి భద్రతను పెంచారు. 

గోవాలో యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్, జిల్లా పోలీసులు, పత్ర్యేక బలగాలను అప్రమత్తం చేశారు. విదేశీ సూరిస్ట్ ల తాకిడి ఎక్కువగా ఉండే గోవా, ఢిల్లీ, ముంబయి నగరాల్లో అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశాలున్నాయని ఇంటిలిజెన్స్ హెచ్చరికలతో ఆయా ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. తీవ్రవాదులు వాహనాలు పేల్చడం..కత్తులతో దాడులు చేయవచ్చని ఇంటలిజెన్స్ హెచ్చరికలు జారీ చేయటంతో ముంబైలోని ఇజ్రాయిల్ రాయబార కార్యాలయంలో భద్రతను పెంచారు. 1000మంది పారా మిలటరీ బలగాలను గోవాలో మోహరించారు. గోవాలో భద్రత కోసం సీఐఎస్ఎఫ్, సీఆర్ పీఎఫ్, బీఎస్ఎఫ్ లకు చెందిన ఆరువేలమంది జవాన్లను రప్పించి మోహరింపజేశారు. దీంతో గోవా రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. 
Also Read : శ్రీలంక బాంబు పేలుళ్లు : హైదరాబాద్ లో అలర్ట్ : HMWSSB