తప్పిన భారీ ముప్పు : 5 కిలోల IED బాంబు నిర్వీర్యం

  • Published By: madhu ,Published On : April 21, 2019 / 11:42 AM IST
తప్పిన భారీ ముప్పు : 5 కిలోల IED బాంబు నిర్వీర్యం

భారీ ముప్పు తప్పింది. CRPF జవాన్లే లక్ష్యంగా మావోయిస్టులు పన్నిన వ్యూహం బెడిసి కొట్టింది. మావోయిస్టులు అమర్చిన 5 కిలోల IED బాంబును CRPF నిర్వీర్యం చేసింది. దీనితో పెను ప్రమాదం తప్పినట్లైంది. పోలీసు ఉన్నతాధికారుల పిలుపు మేరకు పలువురు మావోలు లొంగిపోతున్నారు. ఇదిలా ఉంటే పోలీసులు – మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఇద్దరు మావోలు హతమయ్యారు. 

ఛత్తీస్ ఘడ్ – బీజాపూర్ సరిహద్దులో ఆలంపూర్ గ్రామం ఉంది. ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం ఇక్కడ స్థానిక పోలీసుల సహకారంతో CRPF జవాన్లు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఓ బాంబు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే జవాన్లు అలర్ట్ అయ్యారు. బాంబును నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నం సఫలమైంది. నిర్వీర్యం చేసిన బాంబు 5 కిలోల IEDగా గుర్తించారు. ఇది పేలి ఉంటే భారీ ప్రమాదం జరిగి ఉండేది. 

మరోవైపు మావోయిస్టులు లొంగిపోవాలని పోలీసు ఉన్నతాధికారులు సూచించారు. బీజాపూర్‌లో క్రియాశీలకంగా ఉన్న 15 మంది మావోలు లొంగిపోయారు. ఎస్పీ గణేష్ మిశ్రా ఎదుట వీరు లొంగిపోయారు. ఇందులో ముగ్గురు మహిళలున్నారు