Bomb Found : ఢిల్లీలో బాంబు కలకలం..నిర్వీర్యం చేసిన బాంబు స్క్వాడ్

అక్కడకు చేరుకున్న సిబ్బంది..బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. ఆ బాంబును నిర్వీర్యం చేసింది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అక్కడ భారీగా బలగాలను మోహరించారు...

Bomb Found : ఢిల్లీలో బాంబు కలకలం..నిర్వీర్యం చేసిన బాంబు స్క్వాడ్

Delhi

Bomb Found In East Delhi : మరోసారి భారతదేశంలో రిపబ్లిక్ డే వేడుకలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలోని ఘాజీపూర్‌లో బాంబు కలకలం రేపింది. 2022, జనవరి 14వ తేదీ శుక్రవారం పూల మార్కెట్‌ వద్ద బ్యాగ్‌లో బాంబ్‌ ఉన్నట్లు గుర్తించారు అధికారులు. వెంటనే ఈ సమాచారాన్ని బాంబ్ స్వ్కాడ్ కు అందించారు. అక్కడకు చేరుకున్న సిబ్బంది..బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. ఆ బాంబును నిర్వీర్యం చేసింది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అక్కడ భారీగా బలగాలను మోహరించారు. ఘాజీపూర్‌ పూలమార్కెట్‌ను ఖాళీ చేయించారు అధికారులు. ఇంకెక్కడైనా పేలుడు పదార్ధాలున్నాయా అన్నదానిపై తనిఖీలు చేస్తున్నారు.

Read More : Sangareddy : వ్యసనాలకు బానిసైన తండ్రిని చంపిన కొడుకు

ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరాన్ని (IED) స్వాధీనం చేసుకోవడం జరిగిందని పోలీసు కమిషనర్ రాకేష్ అస్థానా వెల్లడించారు. రద్దీగా ఉండే మార్కెట్ లో పాడుబడిన లెదర్ బ్యాగులో దీనిని అమర్చారని తెలిపారు. బాంబును నిర్వీర్యం చేసిన అనంతరం బ్యాగును ఓ ఓపెన్ గ్రౌండ్ కు తీసుకెళ్లి..8 అడుగుల లోతులో పాతిపెట్టినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని NSG టీం పూర్తిగా చుట్టుముట్టింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.