Bombay HC: రేప్ అటెంప్ట్ కూడా రేప్ చేసినట్లే లెక్క!

మన భారత న్యాయశాస్త్రంలో ప్రతి నేరానికి.. నేర తీవ్రతకు శిక్షల అమలు ప్రత్యేకంగా పొందుపరిచారు. అయితే.. ఒక్కోసారి నేర తీవ్రత తక్కువగానే కనిపించినా బాధితుల మానసిక క్షోభ మాత్రం తీవ్రంగా కనిపిస్తుంది. అందుకే శిక్షాస్మృతిని కూడా సవరణలు చేసి సరికొత్త చట్టాలను తీసుకొస్తుంటారు. అలా తీసుకొచ్చిన ఓ చట్టం ప్రకారం ఆడవారిపై అత్యాచార యత్నం చేసినా..

Bombay HC: రేప్ అటెంప్ట్ కూడా రేప్ చేసినట్లే లెక్క!

Bombay Hc Says Sexual Assault Without Penetration Is Also Rape

Bombay HC: మన భారత న్యాయశాస్త్రంలో ప్రతి నేరానికి.. నేర తీవ్రతకు శిక్షల అమలు ప్రత్యేకంగా పొందుపరిచారు. అయితే.. ఒక్కోసారి నేర తీవ్రత తక్కువగానే కనిపించినా బాధితుల మానసిక క్షోభ మాత్రం తీవ్రంగా కనిపిస్తుంది. అందుకే శిక్షాస్మృతిని కూడా సవరణలు చేసి సరికొత్త చట్టాలను తీసుకొస్తుంటారు. అలా తీసుకొచ్చిన ఓ చట్టం ప్రకారం ఆడవారిపై అత్యాచార యత్నం చేసినా.. అది అత్యాచారం కింద పరిగణలోకి తీసుకోని శిక్షలు విధించవచ్చని ముంబై హైకోర్టు స్పష్టం చేస్తూ ఓ కేసులో శిక్షను ఖరారు చేసింది.

ఓ 33 ఏళ్ల వ్యక్తికి 2019లో జస్టిస్ రేవతి మోహితే డేరే ట్రయల్ కోర్టు ఓ కేసులో భాగంగా అత్యాచారం కింద 10 ఏళ్ల జైలు శిక్షను విధించింది. ఈ కేసులో మేధోపరమైన అత్యాచారంగా పరిగణించి శిక్ష విధించాలని బాధిత మహిళ కోర్టును కోరగా.. సెషన్స్ కోర్టు సదరు వ్యక్తిని దోషిగా తేల్చి శిక్షను ఖరారు చేసింది. అయితే.. బాధితురాలితో తనకు సంభోగం జరగలేదని నిందితుడు సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సవాలు చేస్తూ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. కానీ, బాంబే హైకోర్టు అతను చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది.

ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితుడికి బాధితురాలికి మధ్య సంభోగం జరగకపోయినా.. బాధితురాలి బట్టలపై దొరికిన మట్టి, సంఘటన జరిగిన ప్రదేశం నుంచి సేకరించిన మట్టితో సరిపోలినట్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదిక స్పష్టంగా చేస్తుందని ఈ సాక్ష్యం బాధితురాలి విశ్వసనీయతను తెలియజేస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. ఫోరెన్సిక్ ఆధారాలు దీనిని లైంగిక వేధింపుల కేసుగా రుజువు చేశాయన్న హైకోర్టు.. దీని ప్రకారం అప్పీలుదారు లైంగిక హింసకు పాల్పడ్డట్లేనని తన తీర్పులో స్పష్టం చేసింది.

గతంలో 2012లో నిర్భయ గ్యాంగ్ రేప్ ఘటన తర్వాత అచ్యాచారం, లైంగిక హింస నిర్వచనం పరిధిని పెంచి 2013లో క్రిమన్ లా(సవరణ) చట్టాన్ని భారత పార్లమెంటు ఆమోదించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం అత్యాచారం కేసులో బాధితురాలు చనిపోయినా.. అచేతనావస్థకు చేరుకున్నా.. నిందితుడికి గరిష్ఠంగా మరణ శిక్ష విధించే నిబంధన ఉండగా.. మహిళను వెంటాడటం, ఆమెను అదే పనిగా చూస్తుండటం కూడా ఈ చట్టం ప్రకారం నేరంగానే పరిగణించవచ్చు. ఇక.. కేసు తీవ్రతను బట్టి.. బాధితురాలికి జరిగిన అన్యాయాన్ని పరిగణలోకి తీసుకొని రేప్ అటెంప్ట్ కూడా రేప్ కిందనే పరిగణించే అవకాశం ఉంటుంది.