High court : సీన్ రివర్స్..’భార్య నుంచి భరణం కోరిన భర్త..ఇచ్చి తీరాల్సిందేన్న హైకోర్టు

సీన్ రివర్స్ అయ్యింది. దంపతుల విడాకుల తరువాత కోర్టు సంచలన తీర్పునిచ్చింది.విడికిపోయిన భార్య నుంచి భరణం కోరాడు భర్త. భర్త కోరినట్లుగా భరణం ఇచ్చి తీరాల్సిందేనని హైకోర్టు తీర్పు.

High court :  సీన్ రివర్స్..’భార్య నుంచి భరణం కోరిన భర్త..ఇచ్చి తీరాల్సిందేన్న హైకోర్టు

Woman To Pay Alimony To Husband

woman to pay alimony to husband: కాపురంలో విభేదాలు వచ్చి భార్యాభర్తలు విడిపోవాలనుకంటే భార్యకు భర్త నుంచి భరణం ఇవ్వాలని కోరటం దానికి కోర్టు ఇవ్వాలి అని తీర్పు ఇవ్వటం సర్వసాధారణం. కానీ ఓ విడాకులు కేసులు సీన్ రివర్స్ అయ్యింది. భర్త భార్యకు భరణం ఇవ్వటం కాదు భార్యే భర్తకు భరణం ఇవ్వాలి అని సాక్షాత్తు హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. దిగువ కోర్టు ఈమేరకు ఇచ్చిన తీర్పును సమర్థించింది. భార్య.. భర్తకు భరణం ఇవ్వాలని బొంబాయి​ హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ స్పష్టం చేసింది. మహారాష్ట్రలోని నాందేడ్​ సివిల్​ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. సివిల్​ కోర్టు తీర్పును సవాల్​ చేస్తూ వేసిన పిటిషన్​ను కొట్టివేసింది.

Also read : Russian Soldiers: కుక్కలను ఆహారంగా తింటున్న రష్యా సైనికులు.. రేడియోనే సాక్ష్యం

కేసు వివారాలు ఇలా : 1992లో ఓ జంటకు వివాహం జరిగింది. కుటుంబ కలహాలతో భర్త నుంచి విడాకులు ఇప్పించాలని 2015లో భార్య.. నాందేడ్​ సివిల్​ కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు దంపతులకు 2015లోనే విడాకులు మంజూరు చేసింది. ఈ క్రమంలో హిందూ వివాహ చట్టం 1955లోని సెక్షన్​ 24, 25 ప్రకారం భార్య నుంచి శాశ్వత భరణం, జీవనాధార ఖర్చులు ఇప్పించాలని కోరుతూ ఆమె భర్త పిటిషన్​ వేశాడు. వినటానికి ఇది వింతగా అనిపించొచ్చు. కానీ కొన్ని కేసుల్లో జరిగే ప్రత్యేక సందర్భమే ఈ కేసులోను జరిగింది. ‘నాకు ఎటువంటి జీవనాధారం లేదని, భార్య ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మంచి జీతం తీసుకుంటోందని ఆమె ప్రభుత్వ ఉద్యోగిగా ఆ స్థానంలో ఉండటానికి తాను ఎంతో కష్టపడ్డాను కాబట్టి నాకు భరణం ఇప్పించాలి అని పిటీషన్ లో సదరు భర్త విన్నవించుకున్నాడు.

భర్త పిటిషన్​ను పరిశీలించిన నాందేడ్​ సివిల్​ కోర్టు..విచారణకు స్వీకరించింది. అంతేకాదు కేసును క్షణ్ణంగా పరిశీలించి సదరు భర్త పరిస్థితిని అర్థం చేసుకుంది. దీంతో ఆ భార్య భర్తకు భరణం ఇవ్వాలని ఆదేశించింది. దీంతో సదరు భార్య నాందేడ్​ సివిల్​ కోర్టు తీర్పును సవాల్​ చేస్తూ ఔరంగాబాద్​ హైకోర్టును ఆశ్రయించింది. విడాకులు మంజూరయ్యాక వారి బంధం పూర్తిగా ముగిసిపోయిందని.. కాబట్టి ఎటువంటి భరణం, ఇతర ఖర్చులు ఇవ్వాల్సిన అవసరం లేదని పిటిషనర్​ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

Also read : Drugs Caught in City: డ్రగ్స్ తీసుకుని యువకుడు మృతి: హైదరాబాద్ లోనే మొదటి కేసు నమోదు

కానీ..హిందూ వివాహ చట్టంలోని సెక్షన్​ 25 ప్రకారం ఎప్పుడైనా భరణం కోరుతూ పిటిషన్​ వేయవచ్చన్నారు భర్త తరఫు న్యాయవాది రాజేశ్​ మెవారా. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. భర్తకు భార్య భరణం ఇవ్వాలని తీర్పు వెల్లడించింది. సివిల్​ కోర్టులో వాదనలు, సమర్పించిన డాక్యుమెంట్లు, గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించిన హైకోర్టు.. సివిల్​ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. భర్తకు భరణం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో సదరు భార్యకు దిమ్మ తిరిగిపోయింది. భర్త సంతోషం వ్యక్తంచేశాడు.