రోడ్డుపై ఉల్లి వ్యాన్ బోల్తా : ఇంకేముంది..క్షణాల్లో ఎత్తుకుపోయారు 

  • Published By: veegamteam ,Published On : December 26, 2019 / 09:48 AM IST
రోడ్డుపై ఉల్లి వ్యాన్ బోల్తా : ఇంకేముంది..క్షణాల్లో ఎత్తుకుపోయారు 

జార్ఖండ్‌లోని బొకారో- రామ్‌గఢ్ రోడ్డుపై ఉల్లి బస్తాలతో లోడుతో వస్తున్న వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. బోకారో జిల్లాలోని కాశ్మారా పీఎస్ పరిధిలోని నేషనల్ హైవే-23 సమీపంలో ఉల్లి వ్యాను బోల్తా పడింది. వ్యాన్ లో ఉన్న 3500 కిలోల ఉల్లిపాయలు నేలపాలయ్యాయి. దీతో ఆ ప్రాంతంలోనివారికి బొనాంజా అందినట్లైంది. 

ఉల్లివ్యాన్ బోల్తా పడిన విషయం తెలుసుకున్న కమలాపూర్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారంతా బిలబిలామంటూ అక్కడకు చేరుకున్నారు. అందినకాడికి ఉల్లిపాయల్ని ఎత్తుకుపోయారు. ఒక్క అరగంటలో అక్కడున్న 35 క్విటాళ్ల ఉల్లి క్షణాల్లో మాయమయ్యింది. ఈ ఉల్లిపాయల విలువ 2.5 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. 

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై కాశ్మారా పోలీస్ ఇన్ చార్జ్ రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ..అసలే ఉల్లిపాయకలు దొరక్కా..దొరికినా కిలో రూ. 100 నుంచి రూ.110లు అమ్ముతున్నాయనీ..ఈక్రమంలో ఉల్లిపాయల వ్యాన్ బోల్తా పడిందని తెలుసుకున్న ఈ ప్రాంత ప్రజలు ఉల్లిపాయల్ని పట్టుకుపోయారని తెలిపారు. కమలాపూర్ గ్రామానికి సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించటానికి వ్యాన్ డ్రైవర్ యత్నిస్తుండగా అదుపు తప్పిన వ్యాన్ కంట్రోల్ తప్పి బోల్తాపడిందని పోలీసులు తెలిపారు.