Train ticketలు post officeలలోనూ క్యాన్సిల్ చేసుకోవచ్చు

  • Published By: Subhan ,Published On : May 28, 2020 / 03:18 PM IST
Train ticketలు post officeలలోనూ క్యాన్సిల్ చేసుకోవచ్చు

రైళ్లలో ప్రయాణించి సొంతూళ్లకు వెళ్లాలనుకునే వలస కార్మికులకు మరో అవకాశం కల్పించారు. ఒకవేళ ప్రయాణం రద్దు అయితే తమ టిక్కెట్లను పోస్ట్ ఆఫీసులోనూ క్యాన్సిల్ చేసుకోవచ్చని మంత్రి పీయూశ్ గోయెల్ అంటున్నారు. మే 22 నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్ల కోసం బుక్ చేసిన టిక్కెట్లు క్యాన్సిల్ చేసుకోవడానికి సులువైన పద్ధతిని మొదలుపెడుతున్నారు. 

దీంతో పాటు యాత్రి టిక్కెట్ సువిధ కేంద్రా(YTSK)లైసెన్స్ ఉన్నవారు, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC) ఆథరైజ్డ్ ఏజెంట్ల ద్వారానూ టిక్కెట్లు క్యాన్సిల్ చేసుకోవచ్చు. ప్రత్యేక రైళ్ల కోసం ప్యాసింజర్లు ఇండియన్ రైల్వేస్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్(PRS) కౌంటర్లలో లేదా రిజర్వేషన్ సెంటర్లలో ప్రయత్నించాలని, కామన్ సర్వీస్ సెంటర్లలోనూ ట్రై చేయొచ్చని అన్నారు. 

స్థానిక అవసరాలను బట్టి.. రిజర్వేషన్ కౌంటర్లు తెరవాలని జోనల్ రైల్వేస్ కు సూచనలు అందాయి. జూన్ 1నుంచి 200 ప్రత్యేక రైళ్లు ప్రారంభం కానున్నాయి. ఐఆర్సీటీసీ వెబ్ సైట్ లేదా యాప్ నుంచి బుకింగ్ లు చేసుకోవచ్చు. ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో శ్రామిక్ ట్రైన్ సర్వీసులు నడుస్తున్నాయి. వలస కార్మికులకు 74లక్షల ఫ్రీ మీల్స్, కోటికి పైగా వాటర్ బాటిళ్లు అందజేసింది రైల్వేస్.