భోపాల్ లో కోవాగ్జిన్ ట్రయల్స్

  • Published By: murthy ,Published On : November 28, 2020 / 01:33 PM IST
భోపాల్ లో కోవాగ్జిన్ ట్రయల్స్

Bharat Biotech starts phase III trials for COVID-19 vaccine : దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. నిత్యం వేలల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. వందల సంఖ్యలో జనం వైరస్‌కు బలవుతున్నారు. ఈ క్రమంలో అందరూ వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూస్తున్నారు. భారత్‌లో మూడు టీకాలు అభివృద్ధి దశలో ఉండగా ఇందులో హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ సంస్థ ‘కొవాగ్జిన్‌’ పేరుతో తయారు చేస్తున్న వ్యాక్సిన్‌ ముందంజలో ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో మూడో విడత క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభమయ్యాయి.

తాజాగా మధ్యప్రదేశ్‌ భోపాల్‌లోని పీపుల్స్‌ విశ్వవిద్యాలయంలో కోవాగ్జిన్ ట్రయల్స్ వేస్తున్నారు. భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ వలంటీర్లపై ప్రయోగం ప్రారంభించింది. యూనివర్సిటీలో వ్యాక్సిన్‌ కోసం పేర్లు నమోదు చేసుకున్న వలంటీర్లకు నిపుణుల బృందం సలహాలు ఇవ్వడంతో పాటు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఇది దేశభక్తుడిగా తన కర్తవ్యం అని…..నా దేశానికి నేను సేవ చేయగల ఏకైక మార్గం ఇదే అని పీపుల్స్ మెడికల్ కాలేజీలో టీకా వేయించుకున్న మొదటి వారిలో ఒకరైన 40 ఏళ్ల పాఠశాల ఉపాధ్యాయుడు అన్నారు.



వలంటీర్ల పరీక్షల నివేదికలు సాధారణంగా ఉంటే టీకా మొదటి డోసు ఇస్తారు. అప్పటి నుంచి 28 రోజుల పాటు వారిని పర్యవేక్షిస్తారు . అనంతరం రెండో మోతాదు ఇచ్చిన తర్వాత ఆరు నెలల పాటు పర్యవేక్షించనున్నారు. ఇందుకు అన్ని రకాల అనుమతి తీసుకున్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ వైరాలజీ, ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ సహకారంతో తయారు చేస్తుండగా.. తొలి స్వదేశీ వ్యాక్సిన్‌ ఇదే. ఈ నెల 16న టీకా చివరి విడత క్లినికల్‌ ట్రయల్స్‌ను హైదరాబాద్‌కు చెందిన ఔషధ సంస్థ ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 25 కేంద్రాల్లో 26వేల మంది వలంటీర్లపై ట్రయల్స్‌ నిర్వహిస్తుండగా.. ఇండియాలో ఇదే అతిపెద్ద ట్రయల్‌.



తొలి, రెండు దశల్లో జరిగిన ట్రయల్స్‌లో మెరుగైన ఫలితాలు కనిపించడంతో డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా చివరి విడత ట్రయల్స్‌కు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. టీకా విజయవంతమైతే 2021 సంవత్సరం ప్రారంభంలో అందుబాటులోకి రానుంది. విషయం ఏమిటంటే భారతదేశంలో సరసమైన బయోటెక్‌ వ్యాక్సిన్‌పై పని చేస్తుండగా.. ప్రపంచంలోనే అత్యంత చవకైన వ్యాక్సిన్‌గా నిలుస్తుందని భావిస్తున్నారు.
https://10tv.in/wearing-ppe-kit-pm-modi-reviews-covid-vaccine-progress-at-ahmedabads-zydus-cadila/
ట్రయల్స్‌లో వలంటీర్లకు సుమారు 28 రోజుల వ్యవధిలో రెండు ఇంట్రామాస్కులర్‌ ఇంజెక్షన్లు ఇవ్వనున్నారు. కొవాగ్జిన్‌ రెండు ఆరు మైక్రోగ్రాముల (ఎంసీజీ) ఇంజెక్షన్లు లేదంటే ప్లేసిబో 28 రోజుల వ్యవధిలో రెండు షాట్లను ఇవ్వనున్నారు. మూడో దశలో టీకా తీసుకున్న వలంటీర్లను ఏడాది పాటు పరిశీలించనున్నారు.