India – China fight: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్దమౌతున్న భారత్: నుబ్రా వ్యాలీ-డీబీఓ రోడ్డు పనులు వేగవంతం

నుబ్రా లోయను..డీబీఓ ప్రాంతంతో కలిపే రహదారి పనులను భారత బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బిఆర్ఓ) వేగవంతం చేసింది. తూర్పు లద్దాఖ్ లోని పాంగాంగ్ త్సో సరస్సు మీదుగా చైనా రెండో వంతెనను నిర్మించడంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది

India – China fight: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్దమౌతున్న భారత్: నుబ్రా వ్యాలీ-డీబీఓ రోడ్డు పనులు వేగవంతం

Bro

India – China fight: తూర్పు లద్దాఖ్ లోని పాంగాంగ్ త్సో సరస్సు మీదుగా చైనా రెండో వంతెనను నిర్మించడంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ వంతెన పూర్తయితే ఎల్ఓసీ వెంట 3488 కిలోమీటర్ల పరిధిలోని భారత సరిహద్దుకు చైనా బలగాలు త్వరితగతిన చేరుకోవచ్చు. చైనా చర్యలపై ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తున్న భారత్ సైతం..చైనా కుయుక్తులను ఎదుర్కొనేందుకు భారత్ వైపున ఎల్ఓసీ వెంట మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తుంది. ఈక్రమంలో నుబ్రా లోయను..డీబీఓ ప్రాంతంతో కలిపే రహదారి పనులను భారత బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బిఆర్ఓ) వేగవంతం చేసింది. ఈ కొత్త రహదారి అందుబాటులోకి వస్తే భారత దళాలు దెప్సాంగ్ మైదానాలకు చేరుకోవడానికి మరియు చైనా ఫ్రంట్ కు వెళ్లడానికి ప్రత్యామ్నాయా మార్గాన్ని అందిస్తుంది. ఈ రహదారి లడఖ్ లోని సాసర్ పాస్ గుండా వెళుతు రెండు లోయలను కలుపుతుంది. ప్రస్తుతం ఇది నిర్మాణ సమయం కావడంతో ఈ ప్రాంతంలో నిర్మాణ కార్యకలాపాలు పెరగడంతో నుబ్రా వ్యాలీ-డీబీఓ రోడ్డు పనుల్లో వేగం పుంజుకుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Other Stories:Amit Shah to Rahul Gandhi: ఇటలీ కళ్లద్దాలు తీసేయండి.. రాహుల్‌కు అమిత్ షా చురక

ఇదిలా ఉండగా, భారత భద్రతా దళాలు, ఆర్మీ మరియు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసు(ఐటిబిపి)లు తమ పోరాట నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఎల్ఏసి వెంబడి అనేక ఉమ్మడి విన్యాసాలను నిర్వహిస్తున్నాయి. 2020లో చైనా దురాక్రమణ తరువాత, యధాతథ స్థితిని ఏకపక్షంగా మార్చడానికి, భారత సైన్యం లడఖ్ సెక్టార్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు తన ఐదు విభాగాల కార్యాచరణ పనులను అమలుచేసింది. అదే సమయంలో పాకిస్తాన్ ఫ్రంట్ నుండి చైనా వైపు దృష్టి పెట్టింది భారత సైన్యం. ఎల్ఓసీ వెంట రహదారి మౌలిక సదుపాయాలను కూడా సైన్యం భారీగా అభివృద్ధి చేసింది. ఖర్దుంగ్ లా పాస్ వెంబడి రహదారి నెట్వర్క్ కూడా మెరుగుపరిచారు.