Marriage Cancel: ప్రియురాలి పెళ్లి చెడగొట్టిన ప్రియుడు

Marriage Cancel: ప్రియురాలి పెళ్లి చెడగొట్టిన ప్రియుడు

Marriage Cancel

Marriage Cancel: వారిద్దరూ ప్రేమించుకున్నారు.. రెండేళ్లపాటు చెట్టాపట్టాలేసుకొని తిరిగారు.. మతాలు వేరు కావడంతో పెద్దలు పెళ్ళికి ఒప్పుకోలేదు… దీంతో ఇద్దరు వారిద్దరూ విడిపోయారు. ఈ నేపథ్యంలోనే యువతి తల్లిదండ్రులు వివాహం నిశ్చయం చేశారు. మరికొద్ది రోజుల్లో పెళ్లి జరగనుంది. ఈ తరుణంలోనే రీఎంట్రీ ఇచ్చాడు ప్రియుడు. తనతో ఏకాంతంగా గడిపిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ ప్రియురాలిని బెదిరించడం మొదలు పెట్టాడు.

తనకు రూ. లక్షా 50 వేలు ఇస్తే వీడియోస్ డిలీట్ చేస్తానని లేదంటే అందరికి పంపుతానని బెదిరించాడు. దీంతో సదరు యువతి అతడు అడిగినంత డబ్బు ఇచ్చింది. అయినా కూడా వేధింపులు ఆపలేదు. యువతి పెళ్లి చేసుకోబోతున్న యువకుడికి వీరిద్దరూ ఏకాంతంగా గడిపిన వీడియోలు పంపాడు. ఆ వీడియోలు చూసి యువతి పెద్దలకు ఫోన్ చేసి పెళ్లి క్యాన్సిల్ చెయ్యాలని తెలిపాడు. వారు వివరాలు అడిగితే తనకు వచ్చిన వీడియోల గురించి తెలిపాడు. దీంతో యువతి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ప్రేమికుడిపై పిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ ఘటన మహారాష్ట్రలోని నలాసొపరా చోటుచేసుకుంది.

నలాసొపరాకు చెందిన 24 ఏళ్ల యువకుడు.. అదే గ్రామానికి చెందిన మరో యువతి రెండేళ్లు ప్రేమించుకొని అనేక సార్లు ఏకాంతంగా గడిపారు. ఏకాంతంగా గడిపిన ప్రతి సారి యువకుడు ఆ దృశ్యాలను తన ఫోన్ లో బంధించారు. ప్రియురాలికి పెళ్లి కుదరడంతో బెదిరింపులకు దిగాడు.