కర్ణాటకలో విషాదం : యువకుడిని మింగిన మొసలి

  • Published By: murthy ,Published On : December 4, 2020 / 12:43 AM IST
కర్ణాటకలో విషాదం : యువకుడిని మింగిన మొసలి

Boy herding cattle killed, eaten by crocodile in Raichur : కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో కృష్ణానది పరీవాహక ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని డి.రాంపూర్ గ్రామంలో ఒక విద్యార్దిని మొసలి మింగేసిన ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

డిసెంబర్ 2వ తేదీ బుధవారం నాడు గ్రామానికి చెందిన మల్లి కార్జున్ అనే 10 ఏళ్ల బాలుడు తన 6 గురు స్నేహితులతో కలిసి పశువులను మేపటానికి వెళ్లాడు. వారంతా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. కరోనా వైరస్ కారణంగా పాఠశాలలు మూసి వేయటంతో ఈప్రాంతంలో బాలురంతా పశువులను మేపుతున్నారు. అయితే మధ్యాహ్నం 2గంటల సమయంలో భోజనం చేసి మంచినీళ్లు త్రాగటానికి మల్లి కార్జున్ పక్కనే ఉన్న నది వద్దకు వెళ్ళాడు.



స్నేహితులు చూస్తుండగానే బాలుడు నీటిలో మునిగిపోయాడు. స్నేహితులు గట్టిగా కేకలు వేయటంతో సమీపంలోని గ్రామస్తులు అక్కడకు చేరుకున్నారు. వారంతా గాలించినా బాలుడి ఆచూకి లభించలేదు. ఈ విషయంపై గ్రామస్తులు యాపలదిన్నె పోలీసులకు సమాచారం అందించారు.



కాగా గురువారం తెల్లవారు జామున 2 గంటల సమయంలో మల్లికార్జున్ తల మాత్రమే ఒడ్డుకు చేరింది. కృష్ణానదిలో చాలా మొసళ్ళు ఉన్నందున, నది ఒడ్డున ఉన్న గ్రామస్తులు చాల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కాగా గ్రామం సమీపంలోని కృష్ణా నదిలో 6 మొసళ్లు ఉన్నట్లు స్దానికులు తెలిపారు.