Baba Ramdev : బాబా రాందేవ్‌ను ఒక ఆట ఆడుకుంటున్న నెటిజన్లు

బీజేపీ అధికారంలోకి వస్తే...లీటర్ పెట్రోల్ ధర 40 రూపాయలకే వస్తుందని గతంలో చెప్పిన తన జోస్యం గురించీ..ఎవరూ మాట్లాడకూడదంటున్నారు బాబా రాందేవ్. అప్పుడలా మాట్లాడాను...

Boycott Patanjali : సన్యాసిని…నేనే రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేస్తున్నాను… సంసారులు ఇంకెంత కష్టపడాలి…అందరూ కష్టపడి పనిచేయాలి. సంపాదన పెంచుకోవాలి….ద్రవ్యోల్బణం ఎదుర్కోవడానికి ఉన్నదారి ఇదొక్కటే. ఈ హితోపదేశం ఎవరిదో తెలుసా…? బీజేపీకి ఓటేస్తే….పెట్రో ఉత్పత్తుల ధర లీటరు 40రూపాయలే ఉంటుందని హామీ ఇచ్చిన యోగా గురూ బాబా రాందేవ్‌ది. బీజేపీ అధికారంలోకి వస్తే పెట్రో ఉత్పత్తులపై పన్ను తగ్గుతుందని..లీటర్ పెట్రోల్, డీజిల్ ధర 40 రూపాయలకే చేరుతుందని…ఎనిమిదేళ్ల క్రితం లెక్కలేసి చెప్పిన బాబా రాందేవ్ ఇప్పుడు మాత్రం ఇలా సెలవిస్తున్నారు. ధరల పెరుగుదల ఆగదని, ఆపే ఉద్దేశమేదీ కేంద్రానికి లేదని, ప్రజలే ఆ భారాన్ని మోయాలని, అదనంగా కష్టపడడం, అదనంగా సంపాదించడం ద్వారా పెరిగిన ధరలకు అనుగుణంగా జీవనవ్యయాన్ని పెంచుకోవడం ఒక్కటే ప్రజల ముందున్న మార్గమని..పరోక్షంగా చెప్పుకొస్తున్నారు.

Read More : Baba Ramdev: బాబా రాందేవ్ పై పోలీస్ కేసు

అంతేకాదు….బీజేపీ అధికారంలోకి వస్తే…లీటర్ పెట్రోల్ ధర 40 రూపాయలకే వస్తుందని గతంలో చెప్పిన తన జోస్యం గురించీ..ఎవరూ మాట్లాడకూడదంటున్నారు బాబా రాందేవ్. అప్పుడలా మాట్లాడాను. ఇప్పుడు దీని గురించి నేనేం చెప్పను..? నువ్వేం చేసుకుంటావో చేసుకో… మళ్లీ మళ్లీ ఈ ప్రశ్న అడగడం నీకు మంచిది కాదు…అంటూ బాబా రాందేవ్ గతంలో చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావించిన రిపోర్టర్‌పై ఆగ్రహంతో ఊగిపోయారు. రాందేవ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. 2014లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకాకముందు రాందేవ్ చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు చేసిన వ్యాఖ్యల వీడియోలను పోస్ట్ చేస్తూ ఆయన్ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. #Boycott Patanjali హ్యాష్ ట్యాగ్ తెగ ట్రెండ్ చేస్తున్నారు.

Read More : Baba Ramdev : విలేకరిపై బాబా రామ్ దేవ్‌ ఫైర్.. నోరు మూసుకోమంటూ లైవ్‌లోనే అసహనం.. వీడియో వైరల్‌!

2014లో బాబా రాందేవ్ పన్నుల లెక్కలు వివరిస్తూ మరీ పెట్రో ఉత్పత్తుల ధరలు గురించి మాట్లాడారు. లీటర్ పెట్రోల్ ధర 35 రూపాయలేనని, మిగిలిన ధర అంతా 50శాతం విధిస్తున్న పన్ను వల్ల పెరిగిందని బాబా రాందేవ్ ఆరోపించారు. 50శాతం పన్నును ఒకశాతానికి తగ్గిస్తే…లీటరు పెట్రోల్‌ను 40 రూపాయలే ఉంటుందని, బీజేపీ అధికారంలోకి వస్తే అదే చేస్తుందని ఓ టీవీ షోలో అన్నారు. దేశ ప్రజలు బీజేపీకి ఓటువేస్తే…పెట్రో ఉత్పత్తుల ధరలు దిగివస్తాయన్నారు. ఎల్పీజీ గ్యాస్ ధరలూ తగ్గుతాయని జోస్యం చెప్పారు. ఆర్థికశాస్త్రం అధ్యయనం చేసిన తర్వాతే తానీ ధరల గురించి మాట్లాడుతున్నానని కూడా చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థను ఆర్థిక వేత్తలు నడిపించడం లేదని, వాషింగ్టన్‌కు బానిసలుగా ఉన్నవారు నడిపిస్తున్నారని ఆరోపించారు.

ట్రెండింగ్ వార్తలు