బీబీసీ షోలో మోడీ తల్లిపై అసభ్య దూషణలు…బాయ్ కాట్ బీబీసీ అంటూ దద్దరిల్లుతోన్న ట్విట్టర్

బీబీసీ షోలో మోడీ తల్లిపై అసభ్య దూషణలు…బాయ్ కాట్ బీబీసీ అంటూ దద్దరిల్లుతోన్న ట్విట్టర్

MODI బీబీసీ షోలో ఓ కాలర్ ప్రధాని మోడీ,ఆయన తల్లిని తిట్టడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రఖ్యాత బీబీసీ మీడియా ఆధ్వర్యంలోని బీబీసీ ఆసియా నెట్ వర్క్ విభాగం ‘బిగ్ డిబేట్’ పేరుతో పలు అంశాలపై రేడియో షోలు నిర్వహిస్తుంటుంది. ఇందులో భాగంగా మార్చి 1న లైవ్ లో ప్రసారమైన బీబీసీ రేడియో షోకి భారత సంతతికి చెందిన యాంకర్ ప్రియా రాయ్ ఈ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరించారు.

చర్చలో ఎక్కువ భాగం UK లో సిక్కులు మరియు భారతీయులు ఎదుర్కొంటున్న జాతి వివక్ష చుట్టూ కేంద్రీకృతమై ఉంది. అయితే మూడు గంటలపాటు సాగిన లైవ్ చర్చలో భాగంగా పదుల సంఖ్యలో ఫోన్ కాల్స్ రాగా ‘సిమోన్’ పేరుగల ఓ కాలర్ ఢిల్లీలో రైతుల ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఆయన తల్లి హీరాబెన్ లను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడాడు. మోడీ తల్లి జననాంగాన్ని కాలితో తొక్కేస్తానంటూ భయానక దూషణలు చేశాడు.

సిమోన్ ఉన్మాద వ్యాఖ్యల ఆడియో క్లిప్పు ప్రస్తుతం వైరల్ గా మారింది. కాలర్ కామెంట్లు, యాంకర్ ప్రియా రాయ్ నిస్సహాయతను ప్రశ్నిస్తూ ఈ ఘటనపై బ్రిటన్ టెలీకాం రెగ్యులేటరీ అథారిటీ ‘ఆఫ్ కామ్’ జోక్యం చేసుకోవాలని, సదరు రేడియో ఛానల్ లైసెన్సులను రద్దు చేయాలని భారత సంతతి సంఘాలు, వ్యక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఆ షోని ప్రసారం చేసినందుకు బీబీసీపై సోషల్ మీడియాల వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. భారత్ లో బీబీసీని బ్యాన్ చేయాలని సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాయ్ కాట్ బీబీసీ,బ్యాన్ బీబీసీ హ్యాష్ ట్యాగ్ లు ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉన్నాయి.

తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవడంతో బీబీసీ ఆసియా నెట్ వర్క్ విభాగం క్షమాపణలు చెప్పింది. 3 గంటల కార్యక్రమాన్ని 1.32గంటలకు ఎడిట్ చేసి, అందులో యాంకర్ ప్రియా రాయ్ క్షమాపణలను కూడా జతచేశారు. ‘ఓక హాట్ టాపిక్ పై చర్చ జరుగుతున్న క్రమంలో కాలర్లు ఉద్వేగంగా మాట్లాడటం అప్పుడప్పుడూ జరుగుతుంది. అది లైవ్ షో కాబట్టి అప్పటికప్పుడే ఆపలేకపోయాం. కాలర్ చేసిన పొరపాటుకు క్షమాపణలు కోరుతున్నాం అని యాంకర్ ప్రియా రాయ్ చెప్పుకొచ్చారు. అయితే ఈ వివాదంపై భారత్ నుంచి అధికారిక స్పందన ఇంకా వెలువడలేదు.