Shot Down Pakistan Drone : పాకిస్తాన్ డ్రోన్ కూల్చివేసిన బీఎప్ ఎఫ్ జవాన్లు

భారత్-పాక్ సరిహద్దుల్లోని బోర్డర్ ఔట్ పోస్ట్ డాక్ వద్ద పాకిస్తాన్ డ్రోన్ ను బీఎప్ ఎఫ్ జవాన్లు కూల్చివేశారు. మంగళవారం రాత్రి సరిహద్దులో దట్టమైన పొగమంచులో బీఎస్ఎఫ్ జవాన్లు గస్తీ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో డ్రోన్ శబ్ధం వినిపించింది. దీంతో అప్రమత్రమైన బలగాలు కాల్పులు జరిపారు.

Shot Down Pakistan Drone : పాకిస్తాన్ డ్రోన్ కూల్చివేసిన బీఎప్ ఎఫ్ జవాన్లు

shot down Pakistan drone

shot down Pakistan drone : భారత్-పాక్ సరిహద్దుల్లోని బోర్డర్ ఔట్ పోస్ట్ డాక్ వద్ద పాకిస్తాన్ డ్రోన్ ను బీఎప్ ఎఫ్ జవాన్లు కూల్చివేశారు. మంగళవారం రాత్రి సరిహద్దులో దట్టమైన పొగమంచులో బీఎస్ఎఫ్ జవాన్లు గస్తీ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో డ్రోన్ శబ్ధం వినిపించింది. దీంతో అప్రమత్తమైన బలగాలు కాల్పులు జరిపారు.

ఈ క్రమంలో పాక్ సరిహద్దుల్లో డ్రోన్ కుప్ప కూలిపోయింది. ఆ తర్వాత డ్రోన్ ను పాక్ రేంజర్లు తీసుకెళ్లారు. డ్రోన్ చొరబాటుపై వెంటనే పోలీసులకు, ఇతర ఏజెన్సీలకు సమాచారం అందించినట్లు బీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి చెప్పారు. అనంతరం బీఎస్ఎఫ్, పోలీసులు డావోకేను చుట్టిముట్టి తనిఖీలు నిర్వహించారు.

Pakistan Drone Shot Down : భారత్ లోకి ప్రవేశించిన పాక్ డ్రోన్‌ కూల్చివేత 

ఈ సోదాల్లో భరోపాల్ సమీపంలో ఓ పొలంలో పసుపు రంగు టేపు చుట్టిన ప్యాకెట్ కనిపించింది. దాంట్లో 4.3 హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రం వరకు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినా.. హెరాయిన్ తప్ప వేరే వస్తువులు దొరకలేదని అధికారులు వెల్లడించారు.