రాజ్యాంగాన్ని తయారు చేసింది బ్రాహ్మణుడే..కానీ బీఆర్ అంబేద్కర్‌కు క్రెడిట్ ఇచ్చారు

  • Published By: veegamteam ,Published On : January 4, 2020 / 06:19 AM IST
రాజ్యాంగాన్ని తయారు చేసింది బ్రాహ్మణుడే..కానీ బీఆర్ అంబేద్కర్‌కు క్రెడిట్ ఇచ్చారు

రాజ్యాంగ రూపకర్త..రాజ్యాంగ ముసాయిదాను తయారు చేసింది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాదనీ ఆ ముసాయిదాను తయారుచేసింది ఓ బ్రాహ్మణుడని గుజరాత్ స్పీకర్ రాజేంద్ర త్రివేది సంచలన వ్యాఖ్యలు చేశారు. అద‌లాజ్‌లో శుక్రవారం (జనవరి 3) జ‌రిగిన మెగా బ్రాహ్మణ బిజినెస్ సమ్మిట్ కార్య‌క్ర‌మంలో త్రివేదీ మాట్లాడుతూ ..రాజ్యాంగ ముసాదాను తయారు చేసిన ఆ బ్రాహ్మణుడి పేరు బెనిగ‌ల్ న‌ర్సింగ్ రౌ అని తెలిపారు. కానీ రాజ్యాంగ రూపకర్త ఓ బ్రాహ్మణుడికి రావాల్సిన క్రెడిట్  అంబేద్కర్ కు ఇచ్చారనీ అన్నారు. 

రాజ్యాంగ ముసాయిదాను త‌యారు చేయ‌డంలో బెనిగ‌ల్ న‌ర్సింగ్ రౌ అనే బ్రాహ్మ‌ణుడు ఎంతగానో కృషి చేశారని రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్క‌రే క్రెడిట్ ఇచ్చార‌ని గుజ‌రాత్ అసెంబ్లీ స్పీక‌ర్ రాజేంద్ర త్రివేది వ్యాఖ్యానించారు. రాజ్యాంగ డ్రాఫ్ట్‌ను త‌యారు చేసేందుకు 60 దేశాల రాజ్యాంగాల‌ను చ‌ద‌వాల్సి వ‌చ్చింద‌ని, మ‌రి అంబేద్క‌ర్‌కు ఎవ‌రు ముసాయిదా అందించిన వ్యక్తి దానికి సహాయపడిన వ్యక్తి..అంబేద్క‌ర్‌కు సాయ‌ప‌డింది ఓ బ్ర‌హ్మ‌ణుడ‌ని త్రివేది అన్నారు. 

అంబేద్క‌ర్ కూడా ఈ విష‌యాన్ని నవంబర్ 25,1949 రాజ్యాంగసభలో ప్రసంగంలో తెలిపారని త్రివేది అన్నారు.  1949, నవంబ‌ర్ 25వ తేదీన జ‌రిగిన స‌మావేశంలో అంబేద్క‌ర్ ఈ విష‌యాన్ని చెప్పార‌న్నారు. బ్ర‌హ్మ‌ణుల‌కు క్రెడిట్ ఇచ్చిన అంబేద్క‌ర్ ప‌ట్ల గ‌ర్వంగా ఫీల‌వుతున్న‌ానని స్పీక‌ర్ త్రివేది తెలిపారు. 

నోబెల్ బహుమ‌తులు గెలిచిన 9 మంది భార‌తీయుల్లో ఎనిమిది మంది బ్రాహ్మ‌ణులే అని చెప్పారు. తాజాగా నోబెల్ గెలిచిన ఆర్థికవేత్త అభిజిత్ బెన‌ర్జీ కూడా బ్రాహ్మ‌ణుడే అన్నారు. బ్రాహ్మణులు పిరికివారు అంటారు. కానీ..ఇటీవ‌ల ఢిల్లీలో జ‌రిగిన అగ్నిప్ర‌మాదంలో 11 మందిని కాపాడిన రాజేశ్ శుక్లా కూడా బ్రాహ్మ‌ణుడే అని స్పీక‌ర్ తెలిపారు. ఈ అద‌లాజ్‌లో మెగా బ్రాహ్మణ బిజినెస్ సమ్మిట్ కార్య‌క్ర‌మంలో  సీఎం విజయరూపానీ కూడా పాల్గొన్నారు.