అదే ఆమె లక్ష్యం : తమిళనాడు ఎన్నికల్లో 60ఏళ్ల హిజ్రా

అదే ఆమె లక్ష్యం : తమిళనాడు ఎన్నికల్లో 60ఏళ్ల హిజ్రా

Brathi Kannamma In Tamil Nadu Election Contest

Brathi kannamma in Tamil Nadu election contest : సమాజం నుంచి వివక్షలను ఎదుర్కొనే హిజ్రాలు ఇప్పుడు అన్ని రంగాల్లోని ప్రతిభ చాటుకుంటున్నారు. డాక్టర్లుగా, నర్సులుగా,యాంకర్లుగా,ఆర్టిస్టులుగా, పోలీసులుగా తమదైన శైలిలో ప్రతిభ చాటుతున్నారు. అలాగే రాజకీయాల్లో ట్రాన్స్ జెండర్లు పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడు ఎన్నికల బరిలో హిజ్రా పోటీలో నిల్చుంది. తమిళనాడులోని మధురై దక్షిణ నియోజకవర్గం నుంచి న్యూ జెనరేషన్ పీపుల్స్ పార్టీ తరఫున పోటీ చేస్తోంది భారతి కన్నమ్మ అనే హిజ్రా.

హిజ్రా అంటే ఏదో చదువు సంధ్యలు లేకుండా యాచక వృత్తిమీద ఆధారపడి జీవించే సగటు హిజ్రా కాదు భారతి కన్నమ్మ. భారతీ కన్నమ్మ సోషియాలజీలో డాక్టరేట్ పట్టా పుచ్చుకున్న ఉన్నత విద్యావంతురాలు. 2014 లో మధురై నుంచి లోక్​సభకు పోటీ చేసి ఓడిపోయినా ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోయిని ధీర భారతీ కన్నమ్మ. రాజకీయాల్లో ఎదిగి తమ కమ్యూనిటీ జీవితాల్లో వెలుగులు నింపాలని తపిస్తోంది భారతి కన్నమ్మ. 2014లో ఓడిపోయినా..2019లో కూడా నామినేషన్ వేసింది. కానీ ఆమె నామినేషన్​ తిరస్కరణకు గురైంది.

ఈ క్రమంలో మరోసారి తమిళనాడు ఎన్నికల బరిలో నిలబడింది కన్నమ్మ. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మధురై ని మోడల్​ సిటీ అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తోంది. అంతేకాదు ఎన్నికల ప్రచారంలో అదరగొట్టేస్తు..వినూత్న పద్ధతిలో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారామె. ఓ ట్రాన్స్​జెండర్​గా, విద్యావంతురాలిగా ఎన్నికల్లో పోటీ చేయడం నాకు గర్వంగా ఉందని సగర్వంగా చెబుతోంది కన్నమ్మ.
ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకుంటూ..‘‘మిగతా రాజకీయ నాయకుల్లాగా మాకు కుటుంబాలు ఉండవు. అందువల్ల మేము ఎటువంటి అవినీతికి పాల్పడం.. అవినీతిలేని సమాజానికి అంకురార్పణ చేయాలంటే మాకు ఒక అవకావం ఇవ్వండి’’అంటూ అభ్యర్థిస్తోంది భారతీ కన్నమ్మ. తమ కమ్యూనిటీని వెలుగులో చూడాలని కలలు కంటున్నారు. దానికి రాజకీయాల్లో రాణించి తద్వారా తమ కమ్యూనిటీలో వెలుగు నింపాలనుకుంటున్నారు 60 ఏళ్ల భారతీ కన్నమ్మ.

ట్రాన్స్‌జెండర్ల హక్కుల కోసం పోరాడుతున్న భారతీ కన్నమ్మ (60 ఏళ్లు) మధురై నియోజవర్గం నుంచి డీఎంకే పార్టీ అభ్యర్థికి పోటీగా ఎన్నికల బరిలో ఉన్నారు. న్యూ జనరేషన్‌ పార్టీ ఆమెకు టికెట్‌ ఇచ్చింది. యువత ఓట్లే లక్ష్యంగా పోటీలో ఉన్న ఆమె ‘‘ట్రాన్స్‌జెండర్‌గా ఎన్నికల్లో పోటీ చేస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. మిగతా వారిలా మాకు కుటుంబం లేదు. అందుకే మేము అవినీతికి పాల్పడం. తమిళ ప్రజలకు నాకు ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా’’ నని మరీ ఓట్లు అడుగుతున్నారు భారతీ కన్నమ్మ.

భారతి తన నియోజకవర్గంలోని ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగాలు, రేషన్‌, ఆరోగ్య బీమా, మధురైని ఉత్తమ నగరంగా తీర్చిదిద్దుతాననే హామీలతో ఓటర్లకు హామీలిస్తున్నారు. చట్టసభల్లో ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్లు కోరుతున్న భారతి 2014లోనే మధురై నుంచి లోక్‌సభా స్థానానికి పోటీ చేసిన మొదటి ట్రాన్స్‌జెండర్‌ మహిళగా వార్తల్లో నిలిచారు. సామాజిక కార్యకర్తగానూ పేరుతెచ్చుకున్న భారతీ కన్నమ్మ ఈసారి మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అర్థశాస్త్రంలో బ్యాచిలర్‌ డిగ్రీ, సోషియాలజీలో పీజీ, డాక్టరేట్‌ చదవడమే కాదు కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌లో డిప్లొమ కూడా పూర్తి చేసిన భారతి నిరంతరం తన కమ్యునిటీ క్షేమం కోసం, సమాజం కోసం పాటుపడుతూ ఉంటే భారతీ కన్నమ్మ ఆశలు…ఆశయాలు నెరవేరాలని కోరుకుంటున్నారు పలువురు.