petrol, diesel price today :ఇంధన ధరల దూకుడుకు బ్రేక్.. గుంటూరులో మినహా..

ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న ఇంధన ధరల పెరుగుదలకు కాస్త బ్రేక్ పడింది. గత నెల 22 నుంచి ఏకదాటిగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనాలు బయటకు తీయాలంటేనే వాహనదారులు ఆందోళన ..

petrol, diesel price today :ఇంధన ధరల దూకుడుకు బ్రేక్.. గుంటూరులో మినహా..

Fuel Prices

petrol, diesel price today : ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న ఇంధన ధరల పెరుగుదలకు కాస్త బ్రేక్ పడింది. గత నెల 22 నుంచి ఏకదాటిగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనాలు బయటకు తీయాలంటేనే వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఇంధన ధరల పెరుగుదల ఇతర రంగాలపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలో గురువారం కాస్త ఊరటనిస్తూ పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరగా కొనసాగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు, కేరళ రాష్ట్రం త్రివేంద్రంలో మినహా దేశంలోని ప్రముఖ నగరాల్లో ఇంధన ధరల్లో పెద్దగా మార్పు కనిపించలేదు.

Petrol-Diesel Prices Today : సామాన్యులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

గుంటూరులో పెట్రోల్ రూ. 42 పైసలు పెరిగింది. ఫలితంగా లీటర్ పెట్రోల్ ధర రూ. 121.44కి చేరింది. అదేవిధంగా డీజిల్ రూ. 39 పైసలు పెరిగిన రూ. 107.04కు చేరింది. ఇక కేరళ రాష్ట్రం త్రివేంద్రంలో పెట్రోల్ ధర రూ. 27 పైసలు పెరిగి రూ. 117.19కి చేరింది. డీజిల్ లీటర్ పై రూ. 26 పైసలు పెరిగి రూ. 103.95కు చేరింది. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు చోటుచేసుకోలేదు. దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.41 వద్ద కొనసాగుతుండగా, డీజిల్ రూ. 96.67గా ఉంది. అదేవిధంగా ముంబయిలో లీటర్ పెట్రోల్ రూ. 120.51 కాగా, డీజిల్ రూ. 104.77గా నమోదైంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో లీటర్ పెట్రోల్ రూ. 111.09 ఉండగా, డీజిల్ రూ. 100.94గా ఉంది. చెన్నైలో పెట్రోల్ రూ. 110.85 కాగా, డీజిల్ రూ. 100.94 వద్ద నిలకడగా కొనసాగుతుంది.

Petrol Diesel Price Today : రికార్డు స్థాయిలో పెట్రోల్, డీజిల్ ధరలు

ఇక తెలుగు రాష్ట్రాల్లో చూస్తే గుంటూరు మినహా మిగిలిన ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు చోటు చేసుకోలేదు. ఏపీలోని విశాఖపట్టణంలో పెట్రోల్ ధర రూ. 120, డీజిల్ రూ. 105.65గా ఉంది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ. 119.49 కాగా, డీజిల్ రూ. 105.49 వద్ద కొనసాగుతుంది. గడిచిన 17 రోజుల్లో 14సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సుమారు రూ.10 వరకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.