మతాచారానికి విరుద్ధంగా : ముస్లిం పెళ్లి కూతురు వరుడిని ఏం డిమాండ్ చేసిందంటే..

  • Published By: veegamteam ,Published On : January 28, 2020 / 04:11 PM IST
మతాచారానికి విరుద్ధంగా : ముస్లిం పెళ్లి కూతురు వరుడిని ఏం డిమాండ్ చేసిందంటే..

కేరళకు చెందిన కొత్త పెళ్లి జంట నెటిజన్ల హృదయాలను గెల్చుకుంది. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు చేసిన పని ప్రశంసలు కురిపిస్తోంది. శభాష్, వెరీ గుడ్ అని అంతా మెచ్చుకుంటున్నారు. ఇంతకీ వారి చేసిన పని ఏంటనే వివరాల్లోకి వెళితే.. కేరళలో ముస్లింల మతాచారం ప్రకారం.. నవ వధువుకి పెళ్లి కొడుకు గిఫ్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని మహ్ర్ (Mahr) అంటారు. గిఫ్ట్ గా డబ్బు లేదా ఆభరణాలు లేదా ఇల్లు లేదా విలువైన వస్తువులను వధువు డిమాండ్ చేస్తుంది. మహ్ర్ అనేది వధువు హక్కు. గిఫ్ట్ గా కాబోయే భర్తను ఏమైనా అడగొచ్చు. భార్య కోరికను భర్త తిరస్కరించడానికి వీలు లేదు.

అయితే ఓ నవ వధువు మాత్రం మత ఆచారాన్ని తోసి పుచ్చింది. సంప్రదాయాన్ని తోసి పుచ్చింది. కొత్త ట్రెండ్ సెట్ చేసింది. గిఫ్ట్ గా.. ఆమె డబ్బు కానీ ఆభరణాలు కానీ అడగలేదు. గిఫ్ట్ గా పుస్తకాలు ఇవ్వాలని వరుడిని అడిగింది. 80 పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. భార్య కోరికతో ముందు షాక్ అయిన ఆ భర్త.. కాసేపటికి తేరుకుని.. సంతోషంతో ఎగిరి గంతేశాడు. ఆమె 80 పుస్తకాలు అడిగితే.. అతడు మరో 20 పుస్తకాలు జోడించి.. మొత్తం 100 బుక్స్ గిఫ్ట్ గా ఇచ్చాడు.

వరుడి పేరు హకీమ్ కాగా, వధువు పేరు అజ్నా నిజాం. వీరి పెళ్లి 2019 డిసెంబర్ 29న జరిగింది. ఇప్పుడీ మ్యాటర్ వైరల్ గా మారింది. బెడ్ పై ఓ బుక్ చదువుతూ పక్కనే 100 పుస్తకాలు పెట్టుకుని పెళ్లి కూతురు కూర్చుని ఉన్న ఫొటోని ఫేస్ బుక్ లో పెట్టారు. ఈ పుస్తకాల్లో ఖురాన్, బైబిల్, భగవద్గీత, భారత రాజ్యాంగం కూడా ఉన్నాయి. ఈ ఫొటో ఆధారంగా వారి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కొత్త జంట చేసిన పని నెటిజన్ల మనసులు గెల్చుకుంది.

అంతా వారిని ప్రశంసలతో ముంచెత్తారు. వెరీ గుడ్.. ఫెంటాస్టిక్ అని కితాబిస్తున్నారు. జ్ఞానమిచ్చే పుస్తకాల కన్నా ప్రపంచంలో విలువైనవి ఏవీ లేవన్నారు. ఆమె చాలా ఇంటలిజెంట్ అని మెచ్చుకున్నారు. వెడ్డింగ్ గిఫ్ట్ అదిరిపోయిందని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

2

 

3