బ్రిక్స్ సమ్మిట్ లో పాక్ పై మోడీ ఫైర్

  • Published By: venkaiahnaidu ,Published On : November 17, 2020 / 06:56 PM IST
బ్రిక్స్ సమ్మిట్ లో పాక్ పై మోడీ ఫైర్

PM Modi slams Pakistan ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటోన్న అతిపెద్ద సమస్య ఉగ్రవాదమేనని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలిపారు. రష్యా ఆధ్వర్యంలో జరుగుతున్న బ్రిక్స్ 12వ​ శిఖరాగ్ర సదస్సులో మంగళవారం(నవంబర్-17,2020)వర్చువల్ ​గా ప్రసంగించిన మోడీ..ఉగ్రవాదానికి మద్దతిస్తోన్న దేశాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరోక్షంగా పాకిస్తాన్ ను ఉద్దేశించి మాట్లాడిన మోడీ.. ఉగ్రవాదానికి మద్దతునిస్తోన్న,ఉగ్రవాదులకు సహాయం చేస్తున్న దేశాలను బాధ్యులను చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యను సంస్థాగతంగా ఎదుర్కోవాలని మోడీ తెలిపారు.



బ్రెజిల్,రష్యా,చైనా,దక్షిణాఫ్రికా పాల్గొన్న ఈ బ్రిక్స్ సమ్మిట్ లో భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆత్మనిర్భర్ భారత్’ క్యాంపెయిన్ గురించి కూడా మోడీ ప్రస్తావించారు. సమగ్ర సంస్కరణ విధానాన్ని భారత్ ప్రారంభించిందని మోడీ తెలిపారు. స్వయం సమృద్ధ మరియు కరోనా తర్వాత పునరుద్దరణ భారత్ ప్రపంచ ఎకానమీకి ఓ శక్తి విస్తరణగా మరియు గ్లోబల్ వాల్యూ చైన్స్ లో బలమైన సహకారంగా ఉండబోతుందన్న నమ్మకం ఆధారంగా ఈ క్యాంపెయిన్ ఉందని మోడీ తెలిపారు.



కరోనా సమయంలో మనమందరం దీనికి ఓ ఉదాహరణని కూడా చూశామని మోడీ తెలిపారు. భారతీయ ఫార్మా రంగం సామర్థ్యం కారణంగా 150కిపైగా దేశాలకు భారత్ అత్యవసర మెడిసిన్స్ ని అందించగలిగిందని మోడీ తెలిపారు. భారత వ్యాక్సిన్ ఉత్తత్పి మరియు డెలివరీ సామర్థ్యం ఈ విధంగా మానవతా ప్రయోజనాల కోసం పనిచేస్తుందని మోడీ తెలిపారు.