Bride Groom Escape: పెళ్లిమండపం నుండి కలిసి పారిపోయిన వధువు, వరుడు!

మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కుమారుడు సింహ హీరోగా ఆ మధ్య తెల్లవారితే గురువారం అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తెల్లారితే పెళ్లి అనగా పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెతోనే కలిసి పారిపోతారు. పెళ్లంటే భయంతోనే వీరు అలా పారిపోతారు.

Bride Groom Escape: పెళ్లిమండపం నుండి కలిసి పారిపోయిన వధువు, వరుడు!

Bride Groom Escape

Bride Groom Escape: మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కుమారుడు సింహ హీరోగా ఆ మధ్య తెల్లవారితే గురువారం అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తెల్లారితే పెళ్లి అనగా పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెతోనే కలిసి పారిపోతారు. పెళ్లంటే భయంతోనే వీరు అలా పారిపోతారు. ఆ విషయం మండపంలో పెద్దలకు తెలియకుండా.. వారి ఫ్రెండ్స్ తెల్లవారే వరకు మ్యానేజ్ చేయగా వాళ్లే తిరిగి తెల్లవారేసరికి ప్రేమలో పడి మండపానికి చేరుకొని పెళ్లి చేసుకుంటారు.

అచ్చంగా కాకపోయినా కొంత దాదాపుగా అలాంటి పెళ్లి ఒకటి జరిగింది. ఈ మధ్య పెళ్లిళ్లకు.. పేరంటాలకు కూడా కరోనా కండిషన్స్ పాటించాల్సి వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇదే అదనుగా ఒక్కోసారి పోలీసులు అతి చేస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అలాంటి ఓ పోలీసు పెళ్లి మండలానికి చేరుకొని హడావుడి చేశారు. కోవిడ్ నిబంధనలు సరిగా పాటించడం లేదని.. అతిధులు ఎక్కువమంది వచ్చారని మండపంలో కేకలు వేశారు.

దీంతో పెళ్లి సమాయానికి పోలీసులు తమని మరింతగా ఇబ్బంది పెడతారని.. అనవసరమైన కేసులు పెట్టి పెళ్లి చెడగొడతారని భయపడిన ఆ పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడు జంటగా కలిసి పెళ్లి మండపం నుండే పారిపోయారు. ఒడిశాలోని బాలాసోర్ జిల్లా చాపులియా చౌక్ లో చోటు చేసుకుంది. అయితే ఈ జంట పారిపోయి రెండు రోజులు గడుస్తున్నా ఎక్కడ ఉందని ఇప్పటికీ ఆచూకీ తెలియకపోవడం విశేషం.