Viral video: నా స్టైలే వేరు.. వెరైటీగా పెళ్లి మండపానికి పెళ్లి కూతురు.. వరుడు బంధువులు ఏం చేశారంటే..

కాలం మారుతోంది.. ప్రతీ విషయంలోనూ నేటి యువత కొత్తదనం కోరుకుంటున్నారు. ముఖ్యంగా పెళ్ళిళ్ల సమయంలో వధూవరులు విచిత్ర వేషధారణలతో, ఆటపాటలతో ఆకట్టుకుంటున్నారు. గతంలో పెళ్లి అంటే వధువు కుటుంబ సభ్యుల్లో ఆందోళన ఉండేది. అప్పగింతల సమయంలో అయితే కన్నీటితో వధువును అత్తారింటికి సాగనంపాల్సి వచ్చేది. ప్రస్తుతం ట్రెండ్ మారుతుండటంతో వధువులు సైతం కొత్త ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు.

Viral video: నా స్టైలే వేరు.. వెరైటీగా పెళ్లి మండపానికి పెళ్లి కూతురు.. వరుడు బంధువులు ఏం చేశారంటే..

Weidding

Viral video: కాలం మారుతోంది.. ప్రతీ విషయంలోనూ నేటి యువత కొత్తదనం కోరుకుంటున్నారు. ముఖ్యంగా పెళ్ళిళ్ల సమయంలో వధూవరులు విచిత్ర వేషధారణలతో, ఆటపాటలతో ఆకట్టుకుంటున్నారు. గతంలో పెళ్లి అంటే వధువు కుటుంబ సభ్యుల్లో ఆందోళన ఉండేది. అప్పగింతల సమయంలో అయితే కన్నీటితో వధువును అత్తారింటికి సాగనంపాల్సి వచ్చేది. ప్రస్తుతం ట్రెండ్ మారుతుండటంతో వధువులు సైతం కొత్త ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. ఇటీవల ‘బుల్లెట్ బండి ఎక్కి వచేత్త పా ..’ అంటూ పెళ్లికూతురు డ్యాన్స్ వేయడంతో అదికాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెల రోజుల పాటు సోషల్ మీడియాలో ఆ వీడియో ట్రెండింగ్ లో కొనసాగింది. అదే బాటలో పలువురు వధువులు పెళ్లి సమయంలో డ్యాన్స్ లు వేస్తూ, పాటలు పాడుతూ అందరినీ ఆకట్టుకుంటున్నారు.

అయితే మధ్య ప్రదేశ్ రాష్ట్రంకు చెందిన ఓ యువతి డ్యాన్స్ లు, పాటలు.. పాతబడ్డాయని అనుకుందో ఏమో ఏకంగా ట్రాక్టర్ పై పెళ్లి డ్రస్సులో పెళ్లి మండపానికి వచ్చింది. అప్పటి వరకు పెళ్లికూతురు పల్లకిలో వస్తుందని ఎదురుచూస్తున్న పెళ్లికొడుకు బంధువులు ట్రాక్టర్ తోలుకుంటూ పెళ్లికూతురు రావడంతో ఒక్కసారిగా కంగుతినిపోయారు. మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లా జావ్రా గ్రామంలో ఓ నవ వధువు ట్రాక్టర్ నడుపుకుంటూ కల్యాణ మండపానికి చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. గ్రామానికి చెందిన భారతి తద్గేకు పొరుగూరు యువకుడితో వివాహం నిశ్చయమైంది. వధువు భారతి తన అన్నదమ్ములిద్దరినీ చెరో పక్కన కూర్చోబెట్టుకుని ట్రాక్టర్ నడుపుకుంటూ మండపానికి చేరుకుంది. పెళ్లి దుస్తుల్లో ఉన్న వధువు, నల్లని కళ్లద్దాలు ధరించి హుందాగా ట్రాక్టర్ నడుపుకుంటూ మండపానికి వచ్చింది. పెళ్లి కుమార్తె అలా రావడం చూసిన వరుడు సహా పెళ్లికొచ్చిన వారు షాకయ్యారు.

Viral video: గిరిజన బాలికను కాళ్లతో తంతూ రెచ్చిపోయిన యువకుడు.. సీఎం ఫైర్.. యువకుడు అరెస్ట్..

నా స్టైలే వేరంటూ ట్రాక్టర్ నడుపుకుంటూ వచ్చిన పెళ్లికూతురు వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇదే విషయంపై వధువు మాట్లాడుతూ.. పల్లకీలోనో, కారులోనో ఎంట్రీ ఇచ్చే ట్రెండ్ పాతబడిపోయిందని, అందుకు భిన్నంగా ఏదైనా చేయాలని అనుకున్నాని చెప్పింది. ఇదిలా ఉంటే గతంలో కూడా ఇలానే ఓ వధవు చేతితో కత్తి పట్టుకుని గుర్రం పై స్వారీ చేసుకుంటూ వచ్చిన సంగతి తెలిసిందే.