Groom Baraat On Donkey : గాడిదపై ఊరేగిన వరుడు

సాధారణంగా పెళ్లి బరాత్‌ సందర్భంగా వరుడు గుర్రంపై ఊరేగుతాడు. కానీ దానికి భిన్నంగా ఓ పెళ్లి కుమారుడు గాడిదపై ఊరేగాడు. ఎందుకంటే గుర్రం అందుబాటులో లేకపోవడంతో ఏకంగా గాడిదపై ఊరేగింపుగా పెళ్లికి వెళ్లాడు. ఫన్‌టాప్‌ అనే ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ పోస్ట్‌ చేసిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Groom Baraat On Donkey : గాడిదపై ఊరేగిన వరుడు

Groom Baraat On Donkey

Groom Baraat On Donkey : సాధారణంగా పెళ్లి బరాత్‌ సందర్భంగా వరుడు గుర్రంపై ఊరేగుతాడు. కానీ దానికి భిన్నంగా ఓ పెళ్లి కుమారుడు గాడిదపై ఊరేగాడు. ఎందుకంటే గుర్రం అందుబాటులో లేకపోవడంతో ఏకంగా గాడిదపై ఊరేగింపుగా పెళ్లికి వెళ్లాడు. ఫన్‌టాప్‌ అనే ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ పోస్ట్‌ చేసిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

‘గుర్రం లేకపోతే ఏం గాడిద ఉందిగా’ అని దానికి క్యాప్షన్‌ పెట్టారు. ఈ వీడియోలో వరుడు గాడిదపై కూర్చొని ఉంటాడు. అతడి బంధువులు దాని ముందు డ్యాన్సులు చేస్తారు. మహిళలు కూడా హారతులు ఇస్తారు. అనంతరం వరుడు ఆ గాడిదపై ఊరేగుతూ పెళ్లి మండపానికి చేరుకుంటాడు.

Groom – Bride in JCB: జేసీబీలో ఊరేగుతూ.. పెళ్లికి విచ్చేసిన పెళ్లికొడుకు – పెళ్లికూతురు

పెళ్లి బరాత్‌ సందర్భంగా వరుడు గాడిదపై ఊరేగిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. నెటిజన్లు కూడా ఫన్నీగా కామెంట్లు చేశారు. లాఫింగ్‌ ఇమోజీలతో పాటు పలు జోకులు వేశారు. ‘ఇది నా స్నేహితుడి పెళ్లి’ అని ఒకరు కామెంట్‌ చేశారు. మరికొందరు ఆ వరుడికి తమ అభినందనలు తెలిపారు.