Bride Left Groom: అత్తారిళ్లు దూరముందని.. వివాహ‌మైన ఏడు గంటల్లోనే వరుడికి షాకిచ్చిన వధువు ..

ఉత్తరప్రదేశ్‌లోని బనారస్ నివాసి వైష్ణవికి రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్ గ్రామంకు చెందిన రవితో వివాహం నిశ్చయమైంది. రవి తన పెళ్లి బృందంతో ఊరేగింపుగా వచ్చి బనారస్ కోర్టులో యువతిని వివాహం చేసుకున్నాడు. అప్పగింతల కార్యక్రమం పూర్తయిన అనంతరం వధువు అత్తారింటికి బయలుదేరింది. వరుడు, వరుడి కుటుంబ సభ్యులతో కలిసి ఇన్నావో కారులో ప్రయాణిస్తున్నారు.

Bride Left Groom: అత్తారిళ్లు దూరముందని.. వివాహ‌మైన ఏడు గంటల్లోనే వరుడికి షాకిచ్చిన వధువు ..

Bride

Bride Left Groom: ఉత్తర‌ప్రదేశ్‌లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య వధు, వరులకు ఘనంగా వివాహం జరిగింది. అప్పగింతలు పూర్తయ్యాయి. అత్తారింటికి వెళ్తున్న క్రమంలో మార్గంమధ్యలో వరుడికి వధువు షాకిచ్చింది. నేను అత్తారింటికి రానంటూ ఏడ్చేసింది. దీనికికారణం అత్తారిళ్లు దూరంగా ఉండటమే. వరుడు కుటుంబ సభ్యులు వధువుకు ఎంత నచ్చజెప్పినా వినకపోవటంతో మహిళా పోలీసులు వధువును తిరిగి తమ స్వగ్రామానికి పంపించారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Bride Elope: భర్త దగ్గర 10 రూపాయలు తీసుకొని.. ప్రియుడితో నవ వధువు జంప్ .. భర్త ఏం చేశాడంటే ..

ఉత్తరప్రదేశ్‌లోని బనారస్ నివాసి వైష్ణవికి రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్ గ్రామంకు చెందిన రవితో వివాహం నిశ్చయమైంది. రవి తన పెళ్లి బృందంతో ఊరేగింపుగా వచ్చి బనారస్ కోర్టులో యువతిని వివాహం చేసుకున్నాడు. అప్పగింతల కార్యక్రమం పూర్తయిన అనంతరం వధువు అత్తారింటికి బయలుదేరింది. వరుడు, వరుడి కుటుంబ సభ్యులతో కలిసి ఇన్నావో కారులో ప్రయాణిస్తున్నారు. ఏడు గంటల ప్రయాణం తరువాత కాన్పూర్‌లోని సర్సాల్ ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికే 400 కిలో మీటర్లు ప్రయాణం పూర్తయింది. ఇంకెన్ని కిలోమీటర్లు ప్రయాణించాలని వధువు వరుడు కుటుంబ సభ్యులను ప్రశ్నించింది. మొత్తం 1300 కిలో మీటర్లు, ఇంకా 900 కిలో మీటర్లు ప్రయాణించాలని తెలిపారు. సర్సా‌ల్‌లోని దూద్‌మాతా పెట్రోల్ పంపు సమీపంలో ఇన్నావో కారును ఆపి వరుడు, కుటుంబ సభ్యులు అల్పాహారంకోసం వెళ్లారు. దీంతో వధువు తన మనసుమార్చుకొని అత్తారింటికి నేను వెళ్లను అంటూ ఏడ్వటం మొదలుపెట్టింది. అక్కడే ఉన్న పోలీస్ రెస్పాన్స్ వాహనంలోని సిబ్బంది పెళ్లికూతురు ఏడ్వటాన్ని చూసి ఆమె దగ్గరకు వెళ్లి ఆరాతీశారు. విషయం తెలుసుకొని మహరాజ్ పుర్ పోలీసులకు సమాచారం అందించారు.

Indian Bride: పెళ్లి రోజే ప్రాక్టికల్ ఎగ్జామ్.. పెళ్లి దుస్తుల్లోనే పరీక్షకు హాజరైన నవ వధువు.. వైరల్ అవుతున్న వీడియో

ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు వధువును వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే, వరుడు కుటుంబ సభ్యులు తాము పెళ్లి చేసుకున్నామని, తమ స్వగ్రామానికి వెళ్తున్నామని చెప్పారు. అయితే, యువతి మాత్రం బిగ్గరగా ఏడుస్తూ నాకు ఈ వివాహం వద్దు, రద్దు చేయాలంటూ పోలీసులను ప్రాదేయపడింది. విషయాన్ని వధువు తల్లికి తెలియజేయడంతో.. వరుడు అలహాబాద్ లో ఉంటాడని చెప్పారని, రాజస్థాన్ అయితే తమ కూతుర్ని పంపించమని, వివాహాన్ని రద్దు చేయాలని చెప్పింది. దీంతో పోలీసులు వధువును తిరిగి ఉత్తర ప్రదేశ్ లోని తమ స్వగ్రామానికి పంపించేశారు. వరుడు, అతని కుటుంబ సభ్యులు చేసేదేమీలేక తమ వాహనాల్లో రాజస్థాన్ వెళ్లిపోయారు.