అప్పగింతల్లో విషాదం, అతిగా ఏడుస్తూ చనిపోయిన వధువు

అప్పగింతల్లో విషాదం, అతిగా ఏడుస్తూ చనిపోయిన వధువు

bidaai : పెళ్లి..అనేక ముఖ్యఘట్టాలు ఉంటాయనే సంగతి తెలిసిందే. అందులో అప్పగింతలు ఒకటి. పెళ్ళి చేసుకున్న అనంతరం వరుడు కుటుంబానికి వధువును తల్లిదండ్రులు అప్పగిస్తారు. ఈ టైమింగ్ లో వధువు కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమవుతుంటారు. తమ కుమార్తెకు ఎలాంటి కష్టం రానీయకుండా చూసుకోవాలని, ఏదైనా తప్పులు జరిగితే సర్దుకు పోవాలంటూ..అప్పగిస్తుంటారు. ఇక సున్నితమైన మనస్కులు వారైతే..ఏడుస్తూ…కుప్పకూలిపోతుంటారు. ఇలాగే ఓ ఘటన ఒకటి చోటు చేసుకుంది. అత్తారింటికి వెళ్లే సమయంలో..అతిగా ఏడుస్తూ..వధువు మృతి చెందింది. ఈ ఘటన ఒడిసా రాష్ట్రంలో చోటు చేసుకుంది.

సోనేపూర్ జిల్లాలో గుప్తేశ్వరి సాహూకు ఓ యువకుడి తో వివాహం జరిగింది. మరుసటి రోజు..అత్తారింటికి పంపేందుకు ఏర్పాట్లు చేశారు. నవ వధువుకు వీడ్కోలు పలుకుతుండగా ఒక్కసారిగా ఆమె సృహ కోల్పోయింది. వెంటనే కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు జరపగా..ఆమె చనిపోయిందని నిర్ధారించారు. అప్పగింతల్లో అతిగా ఏడ్వడం వల్ల గుండెపోటు వచ్చిందని, దీంతో వధువు చనిపోయినట్లు పేర్కొన్నారు. నీరసం వల్లే సృహ కోల్పోయిందని భావించామని..ఇంత ఘోరం జరుగుతుందని అనుకోలేదని వధువు కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.