‘Golgappa Bride’ : పానీపూరి నగలు ధరించిన పెళ్లికూతురు..నోరూరించేస్తోంది..

ఆ పెళ్లికూతుర్ని చూసినవారందరికీ నోటిలో నీళ్లు జలపాతంలో పొంగిపోతాయి. వామ్మో..తప్పుగా అర్థం చేసుకోవదండోయ్..ఆ పెళ్లికూతురు ధరించిన నగలు అటువంటివి మరి. ఆమె ధరించిన నగలు‘పానీపూరీ’తో తయారుచేసినవి. అందుకే ఆ పెళ్లికూతుర్ని చూస్తే నోరు ఊరిపోతోంది చూసేవాళ్లకు.

‘Golgappa Bride’ : పానీపూరి నగలు ధరించిన పెళ్లికూతురు..నోరూరించేస్తోంది..

‘golgappa Bride'

bride wearing jewellery made with pani puri at wedding: ఆ పెళ్లికూతుర్ని చూసినవారందరికీ నోటిలో నీళ్లు జలపాతంలో పొంగిపోతాయి. వామ్మో..తప్పుగా అర్థం చేసుకోవదండోయ్..ఎందుకంటే ఆ పెళ్లికూతురు ధరించిన నగల్ని చూస్తే మరి నోరూరిపోతుంది. ఎందుకంటే ఆమె ధరించిన నగలు ‘పానీపూరీ’తో తయారుచేసినవి మరి..అందుకే ఆ పెళ్లికూతుర్ని చూస్తే నోరు ఊరిపోతోంది చూసేవాళ్లకు. నగలు బంగారంతో చేయించుకుంటారు.వెండితో చేయించుకుంటారు. ఇంకా ధనవంతులైతే ప్లాటినమ్ తో చేయించుకుంటారు. నగలు పలు రకాల లోహాలతో చేయించుకుంటారు. కానీ ఓ వధువు మాత్రం పానీపూరీతో చేసిన నగలు ధరించింది. అవేనా అంటే మొత్తం అవీకాదనుకోండీ..పట్టుచీర కట్టుకుంది. బంగారు నగలు భారీగా ధరించింది. వాటితో పాటు ‘పానీపూరీ’ ( గోల్గప్ప)తో నగల్ని కూడా ధరించింది. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు ‘ఇదేందమ్మో..పానీపూరీ అంటూ మరీ ఇంత ఇష్టమైతే తినాలి గానీ ఇలా నగలుగా ధరిస్తారా? ఫన్నీ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.

పానీపూరి పేరు చెబితే చాలు నోటిలో నీళ్లు ఊరిపోతాయి. పానీపూరి అంటే అంత ఇష్టపడతారు జనాలు. చిట్టి చిట్టి పూరీలో కొంచెం కూర వేసి ప్రత్యేకంగా తయారు చేసి స్పైసీ స్పైసీ పానీలో ముంచి నోట్లో పెడితే ఉంటుందీ….ఇక ఆ రుచి మాటల్లో చెప్పలేం. అదీ పానీపూరీ స్పెషల్.
అటువంటి నోరూరించే ‘పానీపూరి అంటే నాకు ప్రాణం..ఎంత ఇష్టమంటే పానీపూరీలను నగలుగా ధరించేంత ఇష్టం’ అంటోందీ వధువు.

అక్షయ అనే వధువు పానీపూరీలను నగలుగా ధరించి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అక్షయ మేకప్ మ్యాన్ ఈ ఫోటోలను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేయటంతో అవి వైరల్ అయ్యాయి. 4.7 మిలియన్లమంది ఈ వీడియోను చూశారు. అక్షయ పానీపూరీల హారం. పానీపూరీలో కిరీటం..పానీపూరీల గాజులు ధరించింది. ఆమె భోజనం చేసే టేబుల్ నిండా కూడా పానీపూరీలే నిండిపోయాయి. అలా పానీపూరీల నగలతో పెళ్లికూతురు అక్షయ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.