PM Modi To BJP MP’s : ఇకనైనా మారండి,లేదంటే మార్పులొస్తాయ్..బీజేపీ ఎంపీలకు మోదీ సీరియస్ వార్నింగ్

పార్లమెంట్​లో హాజరు విషయంపై బీజేపీ ఎంపీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎంపీలు పరివర్తన చెందాలంటూ ప్రధాని హితవుపలికారు. సంప్రదాయానికి భిన్నంగా ఢిల్లీలోని

PM Modi To BJP MP’s : ఇకనైనా మారండి,లేదంటే మార్పులొస్తాయ్..బీజేపీ ఎంపీలకు మోదీ సీరియస్ వార్నింగ్

Modi (2)

PM Modi To BJP MP’s :  పార్లమెంట్​లో హాజరు విషయంపై బీజేపీ ఎంపీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎంపీలు పరివర్తన చెందాలంటూ ప్రధాని హితవుపలికారు. సంప్రదాయానికి భిన్నంగా ఢిల్లీలోని అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్​లో ఇవాళ బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్​లో భేటీకావాల్సి ఉన్నప్పటికీ అక్కడ మరమ్మతులు జరుగుతున్న నేపథ్యంలో ఒకరోజు ముందుగా సమావేశ వేదికను మార్చారు. పార్లమెంట్ కాంప్లెక్స్ బయట బీజేపీ పార్లమెంటరీ భేటీ జరగడం ఇదే తొలిసారి. ఈ కార్యక్రమానికి మోదీ సహా కేంద్ర హోంమంత్రి అమిత్ షా,బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ ఎంపీలు, మంత్రులు, కీలక నేతలు హాజరయ్యారు.

బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ..పార్లమెంట్ సమావేశాలకు బీజేపీ ఎంపీలు హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇదే ఇష్యూని ఎంపీల ముందు మోదీ ప్రస్తావించినప్పటికి కూడా..ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బీజేపీ ఎంపీల హాజరు శాతం పడిపోవడం, ప్రొసీడింగ్స్ జరుగుతోన్న సమయంలో ఎంపీలు గైర్హాజరవుతుండటంపై ప్రధాని సీరియస్ అయ్యారు.

బీజేపీ ఎంపీలనుద్దేశించి మోదీ మాట్లాడుతూ…”పదే పదే చెప్పించుకోడానికి పిల్లలు కూడా ఇష్టపడరు. అలాంటిది బాధ్యతగల పదవుల్లో ఉన్న మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కానట్లుంది. మీరింకా మారరా? లేదూ మేం ఇలాగే వ్యవహరిస్తామంటారా? అయితే సిద్ధంగా ఉండండి…అవసరమైన మార్పులు వాటంతట అవే జరిగిపోతాయి”అని ఎంపీలకు సీరియర్ వార్నింగ్ ఇచ్చారు. క్రమం తప్పకుండా పార్లమెంట్​కు రావాలని,ప్రొసీడింగ్స్ జరుగుతున్న సమయంలో సభలోనే ఉండాలని తీవ్ర స్వరంతో ప్రధాని మోదీ ఎంపీలకు మోదీ స్పష్టం చేశారు.

ప్రజారోగ్యంపై దృష్టి పెట్టాలని బీజేపీ ఎంపీలకు మోదీ సూచించారు. ధృడంగా,ఆరోగ్యంగా ఉండటం కోసం బీజేపీ ఎంపీలందరూ ప్రతిరోజూ సూర్య నమస్కారాలు,యోగా చేయాలని మోదీ సూచించారు. పార్టీ ఎంపీలందరూ తమ నియోజకవర్గాల్లో క్రీడాపోటీలు కూడా నిర్వహించాలని మోదీ సూచించారు. ఆగ్రా ఎంపీ ఎస్పీ సింగ్ బఘేల్ తన నియోజకవర్గంలో ఒక క్రీడా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు గాను ఆయనను ఈ సందర్భంగా ప్రధాని ప్రశంసించారు.

మరోవైపు, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఎంపీలకు కీలక సూచనలు చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల తర్వాత పార్టీ ఎంపీలదంరూ తమ తమ నియోజకవర్గాలను సందర్శించాలని, పార్టీ జిల్లా, మండల అధ్యక్షులతో తరచుగా సంప్రదింపులు జరపాలని సూచించారు. వారితో కలిసి టీ తాగాలని చెప్పారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన నియోజకవర్గమైన వారణాసిలోని.. పార్టీ జిల్లా అధ్యక్షులతో డిసెంబర్ 14న భేటీ అవుతారని వివరించారు.

ఇక,బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో గిరిజన ఎంపీలు పలువురు ప్రధాని మోదీని సత్కరించారు. బిర్సా ముండా జయంతి అయిన నవంబర్ 15ను ‘జన జాతీయ గౌరవ దినోత్సవం’గా ఇటీవల ప్రకటించినందుకుగానూ ఎంపీలు మోదీని సన్మానించారు. కేంద్ర మంత్రి అర్జున్ ముండా సహా పలువురు గిరిజన ఎంపీలు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. శాలువా కప్పి సత్కరించి,జ్ఞాపికను బహూకరించారు.

ALSO READ Red Sandal seized : ఆంధ్ర-తెలంగాణ సరిహద్దులో ఎర్రచందనం దుంగలు స్వాధీనం