Plant : ఒకే మొక్కకు వంకాయ, టమాటాలు

ఒకే మొక్కకు రెండు రకాల కూరగాయలు కాసే విధానాన్ని భారత వ్యవసాయ పరిశోధన మండలి ఆధ్వర్యంలోని వారణాసి కూరగాయల పరిశోధన సంస్థ అభివృద్ధి చేసింది.

Plant : ఒకే మొక్కకు వంకాయ, టమాటాలు

Tamoto (3)

Brinjal and Tomato : ఒకే మొక్కకు రెండు రకాల కూరగాయలు కాసే విధానాన్ని భారత వ్యవసాయ పరిశోధన మండలి ఆధ్వర్యంలోని వారణాసి కూరగాయల పరిశోధన సంస్థ అభివృద్ధి చేసింది. ఒకే మొక్కకు టమాటా, వంకాయ కాసే కొత్త విధానాన్ని కనుగొన్నది. సంకరజాతి వంకాయ రకం కాశీ సందేశ్ ను, టమాటా రకం కాశీ అమన్ తో అంటుకట్టి ఒకే మొక్కకు ఒకేసారి రెండు రకాల కాయలు కాసేలా చేసింది.

కొత్త మొక్కను 15 నుంచి 18 రోజుల తర్వాత భూమిలో నాటి పరీక్షించారు. మొక్క తొలిదశలో వంకాయ, టమాటా కొమ్మలు సమతుల్యంగా పెరిగేలా చర్యలు తీసుకున్నారు. హెక్టారుకు 25 టన్నుల సేంద్రియ ఎరువుతో పాటు కిలో రసాయన ఎరువును వేసి పరీక్షించారు. ఇలా అంటుకట్టిన కొత్త మొక్కల్లో 60 నుంచి 70 రోజుల తర్వాత వంకాయ, టమాటా కాయడం ప్రారంభమైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

Oats : ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా ఓట్స్ తింటే కలిగే ప్రయోజనాలు ఇవే!..

ప్రయోగాత్మక దశలో ఒక్కో మొక్కకు సగటున, 2.684 కిలోల వంకాయలు, 2.383 కిలోల టమాటాలు కాసినట్లు పేర్కొన్నారు. ఈ కొత్త విధానం పట్టణ ప్రాంతం, పట్టణ శివారు ప్రాంతాలకు బాగా ఉపయోగపడుతుందని ఐసీఏఆర్ వివరించింది.