Boris Johnson India: నేడు ప్రధాని మోదీతో బ్రిటన్ ప్రధాని భేటీ: రష్యా – యుక్రెయిన్ యుద్ధం, వాణిజ్య అంశాలపై చర్చ

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో పాటు, ఇరు దేశాల ఆర్ధిక నిపుణులు సూచన మేరకు 'న్యూ ఏజ్ ట్రేడ్ డీల్' (ఎర్లీ హార్వెస్ట్ డీల్)పైనా ద్రుష్టి సారించనున్నారు

Boris Johnson India: నేడు ప్రధాని మోదీతో బ్రిటన్ ప్రధాని భేటీ: రష్యా – యుక్రెయిన్ యుద్ధం, వాణిజ్య అంశాలపై చర్చ

Boris

Boris Johnson India: రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్ చేరుకున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జూన్సన్..గురువారం గుజరాత్ లో పర్యటించారు. గురువారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న ఆయనకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతం పలికారు. ఈక్రమంలో శుక్రవారం భారత ప్రధాని నరేంద్ర మోదీతో బ్రిటన్ ప్రధాని బోరిస్ జూన్సన్ భేటీ కానున్నారు. ఉదయం 11.30 గంటలకు న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో జాన్సన్ భేటీ కానున్నారు. నిజానికి గత ఏడాదిన్నర కాలంలోనే బ్రిటన్ ప్రధాని బోరిస్ జూన్సన్ భారత పర్యటనకు రావాల్సి ఉండగా..కరోనా, రష్యా యుక్రెయిన్ యుద్ధం వంటి సంక్షోభాల నేపథ్యంలో పర్యటన వాయిదాపడుతూ వచ్చింది. ఈక్రమంలోనే గురువారం ఆయన భారత్ చేరుకున్నారు.

Also read:Congress party: అధ్యక్షుడిగా రాహుల్ వద్దు.. కాంగ్రెస్‌లో చర్చనియాంశంగా పీకే పవర్ పాయింట్ ప్రజెంటేషన్..

ఈ పర్యటనలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి ఇరువురు నేతలు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో పట్టుగా రష్యా -యుక్రెయిన్ యుద్ధంపైనా ఇరు దేశాధినేతలు ప్రధానంగా చర్చించనున్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో పాటు, ఇరు దేశాల ఆర్ధిక నిపుణులు సూచన మేరకు ‘న్యూ ఏజ్ ట్రేడ్ డీల్’ (ఎర్లీ హార్వెస్ట్ డీల్)పైనా ద్రుష్టి సారించనున్నారు. ఉత్పత్తి, సేవల రంగం మరియు పెట్టుబడులు అలాగే మేధో సంపత్తి హక్కులు, జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI ట్యాగ్) వంటి అంశాలపై కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రక్షణ రంగంలో ఆయుధాల సేకరణ, ముడిసరుకుల సరఫరా సహా దేశీయంగా ఫైటర్ జెట్స్ ను తయారు చేసుకునేలా బ్రిటన్ భారత్ తో ఒప్పందం కుదుర్చుకోనుంది.

Also read:Nitin Gadkari : EV కంపెనీలకు మంత్రి గడ్కరీ హెచ్చరిక.. భద్రత లోపిస్తే భారీ మూల్యం తప్పదు..!

వీటన్నింటితో పాటు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కూడా నేటి భేటీలో కీలకంగా మారనుంది. ఇప్పటి వరకు భారత్ ఈ విషయంలో తటస్థ వైఖరిని అవలంబిస్తోంది. భారత్ – రష్యా బంధాన్ని తాము అర్ధం చేసుకున్నామని..గురువారం అహ్మదాబాద్ లో బోరిస్ జాన్సన్ వెల్లడించారు. ఈక్రమంలో రష్యా సంక్షోభం పై ప్రధాని మోదీతో, జాన్సన్ పాక్షిక చర్చలే జరుపుతారని తెలుస్తుంది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛ వాణిజ్యంపై అందరికి అవకాశం కల్పించేలా భారత్ మరియు బ్రిటన్ రెండూ అనుకూలంగా ఉన్నాయి.

Also read:Party Donations: ఏడాదికి రూ.212 కోట్లు.. విరాళాలలో బీజేపీ మరో రికార్డు