బ్రిటన్ ఎంపీకి వీసా తిరస్కరణపై…భారత ప్రభుత్వం క్లారిటీ

  • Published By: venkaiahnaidu ,Published On : February 18, 2020 / 10:26 AM IST
బ్రిటన్ ఎంపీకి వీసా తిరస్కరణపై…భారత ప్రభుత్వం క్లారిటీ

కశ్మీర్ విషయంలో మోడీ సర్కార్ నిర్ణయాలపై తీవ్ర విమర్శలు గుప్పించే బ్రిటన్ ఎంపీ డెబ్బీ అబ్రహాం…రెండురోజుల వ్యక్తిగత పర్యటన కోసం సోమవారం ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో అడుగుపెట్టిన ఆమెను వీసా రిజక్ట్ అయిందంటూ ఆమెను ఆపేశారు. అనంతరం అక్కడి నుంచి ఆమెను దుబాయ్ కి పంపించారు. ఆమెయితే దీనిపై వివాదం చెలరేగడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. 

డెబ్బీ అబ్రహం వీసా తిరస్కరణను భారత ప్రభుత్వం సమర్థించుకుంది. భారత వ్యతిరేక కార్యక్రమాల్లో డెబ్బీ అబ్రహం ఇన్వాల్వ్ అయ్యారని, ఆమె ఈ-వీసా రద్దు చేస్తున్నట్లు ముందుగానే తెలిపినట్లు కేంద్ర హోంశాఖ వివరణ ఇచ్చింది. ఫిబ్రవరి 14వ తేదీనే డెబ్బీ అబ్రహామ్స్‌కు సంబంధించి వీసాను రద్దు చేస్తున్నట్లు తెలిపామని హోంశాఖ అధికారులు వివరణ ఇచ్చారు. ఒకరికి వీసా ఇవ్వడం, ఉన్న వీసాను రద్దు చేయడం, లేదా వీసాను తిరస్కరించడం అనేది ఒక దేశ ప్రభుత్వంపై ఆధారపడి ఉంటుంది. కానీ డెబ్బీ అబ్రహామ్స్‌కు ఈ-బిజినెస్ వీసా కూడా ఉంది. గతేడాది అక్టోబర్ 7న దీనిని జారీ చేయడం జరిగింది. అక్టోబర్ 5, 2020వరకు దీని వ్యాలిడిటీ ఉంది. అంటే ఒక వ్యక్తి బిజినెస్ పనిపై ఈ వీసాను వినియోగించుకోవచ్చు. తన బిజినెస్ పనులు పూర్తి చేసుకున్నాక తిరిగి దేశానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ-బిజినెస్ వీసాను కూడా తిరస్కరిస్తున్నట్లు ఫిబ్రవరి 14వ తేదీనే ఆమెకు తెలియజేసినట్లు అధికారులు చెబుతున్నారు. 

వీసా ఎందుకు రద్దు చేశారు, ఎప్పుడు రద్దు చేశారు అనేదానిపై మళ్లీ ప్రశ్నిస్తానంటూ డెబ్బీ ట్వీట్ చేశారు. తనకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపై ఉందని అన్నారు. మానవహక్కులకు, సామాజిక న్యాయంకు తను పీఆర్‌ఓనని చెప్పిన డెబ్బీ.. ఈ హక్కులకు దూరంగా ఉంటున్న ప్రజలపక్షాన తాను గళమెత్తుతానని చెప్పారు. నియంత్రణ రేఖకు ఇరువైపుల ఉన్న కశ్మీరీ ప్రజల పక్షాన తను నిలబడి ప్రశ్నిస్తానని చెప్పారు. ఒక మిత్రుడు మరో మిత్రుడిని గౌరవిస్తూనే విమర్శలు గుప్పించడం సరికాదన్న డెబ్బీ.. ఆరోగ్యకరమైప ప్రజాస్వామ్య దేశానికి ఇది మంచిది కాదన్నారు. కశ్మీర్ అంశంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరును విమర్శిస్తే కేంద్రం ఎందుకు ఉలిక్కిపడుతోందని ప్రశ్నించారు.

అంతుకుముందు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ఆపడంపై సోమవారం డెబ్బీ అబ్రహాం మాట్లాడుతూ….దుబాయ్ నుంచి సోమవారం(ఫిబ్రవరి-17,2020) ఉదయం 8:50 గంటలకు ఢిల్లీ ఎయిరోపోర్టులో ల్యాండ్ అయ్యాము. అయితే గత అక్టోబర్ లో జారీ చేసిన ఈ- వీసా గడువు ఈ ఏడాది అక్టోబర్ వరకు ఉన్న వీసా గడవు ఉంది. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లోని ఇమ్మిగ్రేషన్ డెస్క్ దగ్గర ఈ-వీసా సహా పలు డాక్యుమెంట్లతో తాను ఉదయం హాజరయ్యాను.నా ఫొటోలు కూడా తీసుకున్నారు. స్కీన్ లో నన్ను అధికారి చూశాడు. తలను ఊపుతూ ఆ అధికారి..మీ వీసా తిరస్కరించబడింది అని చెప్పారు. ఆ తర్వాత తన పాస్ పోర్ట్ తీసుకొని 10నిమిషాలు కనిపించకుండా ఆ అధికారి ఎక్కడికో వెళ్లాడు.

10నిమిషాల అనంతరం తిరిగొచ్చిన ఆ అధికారి చాలా రూడ్ డా,ఆవేశంగా మాట్లాడాడు. నాతో రండి అంటూ పెద్దగా అరిచాడు. నాతో అలా మాట్లాడవద్దని నేను చెప్పాను, ఆపై డిపార్టీ సెల్ గా గుర్తించబడిన చుట్టుముట్టబడిన ప్రాంతానికి తీసుకువెళ్ళారు. అతను నన్ను కూర్చోమని ఆదేశించాడు. నేను నిరాకరించాను. వారు ఏమి చేయవచ్చో, వారు నన్ను ఎక్కడికి తీసుకెళ్లవచ్చు అనేది నాకు తెలియదు. ప్రజలు నన్ను చూడాలని నేను కోరుకున్నాను అని ఎంపీ డెబ్బీ అబ్రహం ఓ ప్రకటనలో తెలిపారు.

అదే సమయంలో వీసా ఆన్ అరైవల్ ఉంటే ఇవ్వండని కూడా తాను విజ్ఞప్తి చేసినట్లు డెబ్బీ అబ్రహామ్స్ చెప్పారు. అయితే తనకు ఎవ్వరూ ఎలాంటి సమాధనం చెప్పలేదని డెబ్బీ తెలిపారు. తనకు ఘోర అవమానం జరిగిందని, తనను భారత్‌లో క్రిమినల్‌లా చూశారనే భావనతోనే తిరిగి వెళుతున్నట్లు డెబ్బీ చెప్పారు.