Kartarpur : దేశ విభజనతో దూరమయ్యారు.. 74 సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు

మహమ్మద్ సిద్ధిఖి, మహమ్మద్ హబీబ్‌ సోదరులు. 1947లో దేశ విభజన సమయంలో దూరమయ్యారు. పాకిస్తాన్‌‌లోని ఫైసలాబాద్‌లో సిద్ధిఖి స్థిరపడగా హబీబ్ ఇండియాలోని పంజాబ్‌ రాష్ట్రంలో నివాసముంటున్నాడు.

Kartarpur : దేశ విభజనతో దూరమయ్యారు.. 74 సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు

Meet 11zon

Brothers met after 74 years in Kartarpur : విధి వారిని దూరం చేసింది. అనుకోని పరిస్థితులు అన్నదమ్ములను వేరు చేశాయి. ఒకరు పాకిస్తాన్‌లో స్థిరపడగా.. మరొకరు భారత్‌లో ఉండిపోయారు. ఒక‌రికొకరికి ఆత్మీయ స్పర్శే మ‌రిచిపోయారు. అలాంటిది 74 సంవ‌త్సరాల త‌ర్వాత క‌ర్తార్‌పూర్‌లో క‌లుసుకున్నారు. ఒక‌రినొక‌రు గాఢంగా ఆలింగ‌నం చేసుకొని, భావోద్వేగానికి లోన‌య్యారు.

మహమ్మద్ సిద్ధిఖి, మహమ్మద్ హబీబ్‌ సోదరులు. 1947లో దేశ విభజన సమయంలో దూరమయ్యారు. పాకిస్తాన్‌‌లోని ఫైసలాబాద్‌లో సిద్ధిఖి స్థిరపడగా, హబీబ్ ఇండియాలోని పంజాబ్‌ రాష్ట్రంలో నివాసముంటున్నాడు. వీరి బంధువులు సోషల్ మీడియా సాయంతో ఇద్దరి ఆచూకీని తెలుసుకున్నారు. కర్తార్‌పూర్ కారిడార్ వద్ద ఒకరినొకరు కలుసుకునేందుకు ఏర్పాట్లు చేశారు.
Amaravati Corporation : అమరావతి కార్పొరేషన్‌ ఏర్పాటును వ్యతిరేకించిన 19 గ్రామాలు

ఆ సమయం రానే రావడంతో.. సోదరులిద్దరూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఆనందంతో కౌగిలించుకుని ఆప్యాయంగా పలుకరించుకున్నారు. ఇన్నేళ్లూ ఇండియాలో ఉంటూ తాను పెళ్లి చేసుకోలేదని, తల్లి జ్ఞాపకశక్తి కోల్పోయి కన్నుమూసిందని హబీబ్ తన సోదరుడితో చెబుతూ కంటతడిపెట్టాడు. ఈ అపూర్వ సోదరుల ఉద్విగ్న క్షణాలను చూసి వారి బంధువుల కళ్లు చెమ్మగిల్లాయి.