BSF Constable Arrest : భారత రహస్య సమాచారాన్ని పాక్‌కి చేరవేసిన కానిస్టేబుల్

పాకిస్తాన్‌కు భారత్‌ భద్రత పరమైన సమాచారం చేరవేస్తున్న బీఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ను గుజరాత్‌లోని గాంధీనగర్‌లో యాంటీ టెర్రరిస్ట్‌ స్వ్కాడ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

BSF Constable Arrest : భారత రహస్య సమాచారాన్ని పాక్‌కి చేరవేసిన కానిస్టేబుల్

Bsf Arrest

BSF Constable Arrest :  పాకిస్తాన్‌కు భారత్‌ భద్రత పరమైన సమాచారం చేరవేస్తున్న బీఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ను గుజరాత్‌లోని గాంధీనగర్‌లో యాంటీ టెర్రరిస్ట్‌ స్వ్కాడ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జమ్ముకశ్మీర్‌ రాజౌరీకి చెందిన మహమ్మద్‌ సజ్జద్‌ బీఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఇతడు గత కొంతకాలంగా భారత్‌ భద్రతపర రహస్యాలను ఫోన్‌ మెసెజ్‌ ద్వారా పాక్‌కు చేరవేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

చదవండి : Pattabhiram Arrest : నా భర్తకు ప్రాణ హాని ఉంది : పట్టాభి సతీమణి

నిందితుడికి పాకిస్తాన్‌తోని కొందరితో సన్నిహితం సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. బీఎస్ఎఫ్‌లో చేరకముందు 46 రోజులు పాక్‌లో అధికారులు తేల్చారు. డబ్బుకోసం మహమ్మద్‌ సజ్జద్‌ ఈ పని చేశాడని ఏటీఎస్‌ డిప్యూటి ఎస్పీ చవ్‌దా తెలిపారు.

చదవండి : Ganja Traders Arrested :జగిత్యాలలో గంజాయి విక్రేతలు అరెస్ట్