పాకిస్తానీ రా..పౌరసత్వం ఇస్తాం అంటూ..జవాన్ ఇంటిని కాల్చేశారు

  • Published By: madhu ,Published On : February 28, 2020 / 02:18 PM IST
పాకిస్తానీ రా..పౌరసత్వం ఇస్తాం అంటూ..జవాన్ ఇంటిని కాల్చేశారు

భారత దేశాన్ని రక్షించేందుకు..ప్రజలను కాపాడేందుకు సరిహద్దులో శ్రమిస్తున్న ఓ జవాన్ ఇంటిని దుండుగులు కాల్చేశారు. ఇంట్లో మనుషులు ఉంటారనే సంగతి వారు మరిచిపోయారు. గ్యాస్ సిలిండర్ వేసి..నిప్పు పెట్టారు. దీంతో ఆ ఇళ్లు మొత్తం కాలిపోయింది. అందులో ఉన్నవస్తువులు ఏమీ మిగలలేదు. త్వరలోనే ఆ ఇంట్లో పెళ్లి భాజాలు మోగనున్నాయి. బంగారం, వెండి, లక్షల నగదు మొత్తం అగ్నికి ఆహుతైంది. ప్రస్తుం ఆ జవాన్ కుటుంబం వేరే ఇంట్లో తలదాచుకొంటోంది. హృదయాలను కదలించివేసే ఎన్నో ఘటనలు ప్రస్తుతం ఢిల్లీలో కనిపిస్తున్నాయి. అలాంటిదే ఇదొకటి..

వివరాల్లోకి వెళితే…
నార్త్ ఈస్ట్ ఢిల్లీలో మూడు రోజుల పాటు చెలరేగిన హింసలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్ల రూపాయల ఆస్తినష్టం సంభవించింది. కాస్ ఖజూరి గల్లీలో బీఎస్ఎఫ్ జవాన్ మహ్మద్ ఆనీ కుటుంబం నివాసం ఉంటోంది. 2020, ఫిబ్రవరి 25వ తేదీ మంగళవారం అతని ఇంటికి సమీపంలో ముష్కరులు రెచ్చిపోయారు. సమీపంలో ఉన్న కార్లకు నిప్పుపెట్టారు. ఆ వెంటనే ఆనీ నివాసంపై రాళ్ల వర్షం కురిపించారు. ఇంట్లో ఉన్న వారు తీవ్ర భయాందోనళలకు గురయ్యారు.

‘ఇదర్ ఆ పాకిస్తాన్, తుజే నాగరికత దేతే హై’ అంటూ నినాదాలు చేశారు. ఓ గ్యాస్ సిలిండర్‌ను ఇంట్లోకి వదిలారు. అనంతరం నిప్పు పెట్టారు. ఇంట్లో ఆనీ తండ్రి మహ్మద్ మునీస్, అంకుల్ మహ్మద్ అమ్మద్, నేహా ప్రవీణ్ (18) ఉన్నారు. వెంటనే ఇంట్లో నుంచి బయటకు ఎలాగోలా వచ్చారు. పారామిలటరీ బలగాల సహాయంతో అక్కడి నుంచి క్షేమంగా బయటపడ్డారు. ఆనీ నివాసంతో పాటు 35 ఇళ్లకు దుండగులు నిప్పు పెట్టారు. 

రానున్న మూడు నెలల్లో ఆనీ కుటుంబంలో రెండు పెళ్లిళ్లు జరగాల్సి ఉంది. నేహా ప్రవీణ్ వివాహం ఏప్రిల్‌లో, ఆనీ వివాహం కూడా జరగాల్సి ఉంది. ఈ సందర్భంగా పెళ్లికి అవసరమైన సామాగ్రీ, వస్తువులు కొని పెట్టుకున్నారు. రెండు బంగారు నెక్లెస్, వెండి ఆభరణాలు, రూ. 3 లక్షల నగదు మొత్తం కాలిపోయిందని ఆనీ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. బంగారు ఆభరణాలను వాయిదా పద్దతి ద్వారా కొనడం జరిగిందన్నారు. 

ఖజూరి గల్లీలో అధికంగా హిందూ కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. కానీ..స్థానికంగా ఉన్న వారు ఘర్షణల్లో పాల్గొనలేదని, బయటి నుంచి వచ్చిన వ్యక్తులున్నారని తెలిపారు. 2013లో బీఎస్ఎఫ్‌లో చేరిన ఆనీ..మూడు సంవత్సరాలుగా భారత సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More :చైనా వెళ్తేనే కాదు..ఎక్కడకైనా వైరస్ సోకగలదా..?