BSNL Super Offer : వాడుకున్నోళ్లకు వాడుకున్నంత.. బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ఆఫర్.. ఈ ప్లాన్‌తో అన్ లిమిటెడ్ డేటా

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులను ఆకట్టుకునేందుకు పలు ఆకర్షణీయ ఆఫర్లు ప్రకటించింది. తక్కువ ధరలోనే ఎక్కువ డేటా అందిస్తోంది. ఇందుకోసం కొన్ని దీర్ఘకాల..

BSNL Super Offer : వాడుకున్నోళ్లకు వాడుకున్నంత.. బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ఆఫర్.. ఈ ప్లాన్‌తో అన్ లిమిటెడ్ డేటా

Bsnl

BSNL Super Offer : ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులను ఆకట్టుకునేందుకు పలు ఆకర్షణీయ ఆఫర్లు ప్రకటించింది. తక్కువ ధరలోనే ఎక్కువ డేటా అందిస్తోంది. ఇందుకోసం కొన్ని దీర్ఘకాల ప్రీపెయిడ్ ప్లాన్లు తీసుకొచ్చింది.

కొత్తగా తీసుకొచ్చిన ప్లాన్లలో రూ.599 అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. ఈ ప్లాన్‌ కింద ప్రతిరోజు 5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు అందుతాయి. వీటితో పాటు జింగ్‌మ్యూజిక్‌ను ఉచితంగా ఆనందించవచ్చు. ఇక అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం ఐదింటి వరకు అన్‌లిమిటెడ్‌ డేటా అందిస్తోంది. ఇన్ని ఆఫర్లు ఉన్న ప్లాన్‌ వ్యాలిడిటీ ఏకంగా 84 రోజులు. ఈ ధరలో ఇన్ని ఫీచర్లు ఉన్న ప్లాన్ మరే టెలికాం సంస్థ అందించడం లేదని బీఎస్ఎస్ఎల్ చెప్పింది.

Union Bank of India Jobs : యూనియన్ బ్యాంకులో ఉద్యోగాలు.. దరఖాస్తు ప్రక్రియ వివరాలు

దీర్ఘకాల ప్లాన్ల వివరాలు:

* రూ.2,399..
వ్యాలిడిటీ- 425 రోజులు
వాయిస్‌ కాల్స్‌- అన్ లిమిటెడ్
డేటా- రోజూ 3జీబీ
ఎస్‌ఎంఎస్‌లు- రోజూ 100
ఉచిత బీఎస్‌ఎన్‌ఎల్‌ ట్యూన్స్‌

* రూ.1,999
వ్యాలిడిటీ – 365 రోజులు
వాయిస్‌ కాల్స్‌- అపరిమితం
డేటా- 600 జీబీ
ఎస్‌ఎంఎస్‌లు- రోజుకు 100
ఉచిత బీఎస్‌ఎన్‌ఎల్‌ ట్యూన్స్‌, 60 రోజుల వరకు వావ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సబ్‌స్క్రిప్షన్‌, ఈరోస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సబ్‌స్క్రిప్షన్‌

* రూ.1,999
వ్యాలిడిటీ – 180 రోజులు
వాయిస్‌ కాల్స్‌- అపరిమితం
డేటా- రోజూ 3 జీబీ
ఎస్‌ఎంఎస్‌లు- రోజుకు 100
60 రోజుల వరకు ఉచిత బీఎస్‌ఎన్‌ఎల్‌ ట్యూన్స్‌, వావ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సబ్‌స్క్రిప్షన్

Jaggery Milk : చలికాలంలో పాలల్లో బెల్లం కలిపి తీసుకుంటే?

ఇటీవలే అన్ని టెలికం కంపెనీలు భారీగా రీచార్జి ధరలను పెంచేశాయి. వినియోగదారులపై భారం మోపాయి. రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్-ఇడియా కంపెనీలు టారిఫ్ ధరలను పెంచేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో వినియోగదారులను అట్రాక్ట్ చేసేందుకు బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్లు తీసుకొచ్చింది.