BSP Chief Mayawati: పొత్తులుండవ్..! లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగానే బరిలోకి దిగుతుంది..

2023లో కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ తో పాటు ఎక్కడ ఎన్నికలు జరిగినా బీఎస్పీ సింగిల్‌గానే ప్రజల్లోకి వెళ్తుందని బీఎస్పీ అధినేత మాయావతి అన్నారు. ఈవీఎంల పట్ల దేశ ప్రజల్లో ఆందోళన నెలకొందని, దీన్ని అధిగమించాలంటే బ్యాలెట్ పేపర్ తో తదుపరి ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.

BSP Chief Mayawati: పొత్తులుండవ్..! లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగానే బరిలోకి దిగుతుంది..

Mayawati

BSP Chief Mayawati: బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయవతి కీలక ప్రకటన చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా లక్నోలో ఆమె మీడియాతో మాట్లాడారు. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మేం ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోమని, సింగిల్‌గానే బరిలోకి దిగుతామని ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఏ పార్టీతో బీఎస్పీకి పొత్తు ఉండదని మాయావతి స్పష్టం చేశారు.

Mayawati: కీర్తికి తగ్గట్టుగా సమాధానం చెప్పారు.. భారత సైన్యానికి మాయావతి ప్రశంసలు

2023లో కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ తో పాటు ఎక్కడ ఎన్నికలు జరిగినా బీఎస్పీ సింగిల్ గానే ప్రజల్లోకి వెళ్తుందని ఆమె అన్నారు.  ఈవీఎంల పట్ల దేశ ప్రజల్లో ఆందోళన నెలకొందని, దీన్ని అధిగమించాలంటే బ్యాలెట్ పేపర్ తో తదుపరి ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలవల్ల అభివృద్ధి జరగలేదని, మొదటి నుంచి పేదరికం, నిరుద్యోగం పెరిగిపోయిందని, రైతులు, కూలీలు, చిరు వ్యాపారులు అందరూ అసంతృప్తితో ఉన్నారని మాయావతి అన్నారు. బీజేపీ హయాంలో పరిస్థితి మరింత దిగజారిపోయిందని ఆమె అభిప్రాయపడ్డారు. యూపీ సహా లా అండ్ ఆర్డర్ ముసుగులో నీచ రాజకీయాలు చేస్తున్నారని, దర్యాప్తు సంస్థనుకూడా దుర్వినియోగం చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

బీఎస్పీని అధికారంలోకి తీసుకొనిరావాలని నిర్లక్ష్యానికి గురైన వర్గాల ప్రజలకు మాయావతి విజ్ఞప్తి చేశారు. బీఎస్పీ అధికారంలోకి వస్తేనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన చట్టాలను సద్వినియోగం చేసుకోగలుగుతామని అన్నారు. సమాజ్ వాదీ పార్టీపై మాయావతి మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను పార్లమెంట్ లో ఆమోదించడానికి ఎస్పీ ప్రభుత్వం అనుమతించలేదని, అయితే పార్లమెంట్ లో బిల్లు రూపాన్నికూడా చించివేసిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఎస్పీ కూడా సాధువులు, గురువులను గౌరవిస్తుందని చెప్పారు. అనంతరం ఆమె తన పుట్టినరోజు సందర్భంగా పుస్తకాన్ని విడుదల చేశారు.