BSP Chief : పొత్తుల్లేవ్.. యూపీ, ఉత్తరాఖండ్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ

వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న ఉత్తరప్రదేశ్,ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ(BSP) ఒంటరిగానే ఒరిలోకి దిగుతుందని,ఎవరితో పొత్తుపెట్టుకునే ఆలోచన లేదని ఇవాళ ఉదయం ఆ పార్టీ చీఫ్ మాయావతి ట్విట్టర్ ద్వారా సృష్టం చేశారు.

BSP Chief : పొత్తుల్లేవ్.. యూపీ, ఉత్తరాఖండ్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ

Mayawati

BSP Chief వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న ఉత్తరప్రదేశ్,ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ(BSP) ఒంటరిగానే ఒరిలోకి దిగుతుందని,ఎవరితో పొత్తుపెట్టుకునే ఆలోచన లేదని ఇవాళ ఉదయం ఆ పార్టీ చీఫ్ మాయావతి ట్విట్టర్ ద్వారా సృష్టం చేశారు. యూపీ ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎంతో బీఎస్పీ పొత్తు పెట్టుకోవచ్చంటూ వచ్చిన వార్తలను మాయావతి కొట్టి పారేశారు.

అయితే వచ్చే ఏడాదే జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం శిరోమణి అకాలీదళ్‌- బీఎస్పీ కలిసి పోటీ చేస్తున్నట్లు మాయావతి తెలిపారు. కాగా,పంజాబ్ లోని బీఎస్పీ-శిరోమణి అకాళీదల్ మధ్యఇప్పటికే సీట్ల పంపకం కూడా పూర్తి అయింది. పంజాబ్ లోని మొత్తం 117 స్థానాల్లో బీఎస్పీ 20 స్థానాల్లో,శిరోమణి అకాళీదల్ 97 స్థానాల్లో పోటీ చేయనుంది.

మరోవైపు, వచ్చే ఏడాది జరిగే యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్.బీఎస్పీ పార్టీలతో పొత్తు ప్రశక్తే లేదని సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ఇదివరకే ప్రకటించారు. యూపీలో బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉందని..2017 లో ఆ పార్టీతో తాము చేతులు కలిపినప్పటికీ ఫలితం లేకపోయిందని ఆయన చెప్పారు. ఆ పార్టీకి 100 సీట్లు ఇచ్చినా వారు గెలవలేకపోయారన్నారు. ఇప్పుడు తమతో కలిసి వచ్చే పక్షాలతోను, భావసారూప్యం గల చిన్నా చితకా పార్టీలతోనూ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని అఖిలేష్ యాదవ్ చెప్పారు.