Arshad Rana : అయ్యో పాపం.. పార్టీ టికెట్ ఇవ్వలేదని బోరున విలపించిన నేత.. ప్రాణాలు తీసుకుంటానని హెచ్చరిక

తనకు పార్టీ టికెట్ దక్కలేదని ఓ నాయకుడు వెక్కి వెక్కి ఏడ్చాడు. చిన్న పిల్లాడిలా బోరున విలపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

10TV Telugu News

Arshad Rana : దేశంలో ఎన్నికల హడావుడి నెలకొంది. 5 రాష్ట్రాల అసెంబ్లీలకు త్వరలో ఎలక్షన్స్ జరగనున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా దేశంలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలపైనే అందరి ఫోకస్ ఉంది. యూపీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ తేదీలు ఖరారు కావడంతో గెలుపు గుర్రాల ఎంపికపై అన్ని పార్టీలు దృష్టి పెట్టాయి. తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీ టికెట్ల విషయంలో వివాదం నెలకొంది. టికెట్ దక్కని వారిలో కొందరు రోడ్డెక్కి నిరసన తెలిపితే మరికొందరు కలత చెందుతున్నారు.

తనకు పార్టీ టికెట్ దక్కలేదని ఓ నాయకుడు వెక్కి వెక్కి ఏడ్చాడు. చిన్న పిల్లాడిలా బోరున విలపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Covid 3rd Wave : పిల్లలపైనే ఒమిక్రాన్ ప్రభావం ఎక్కువ.. ఎందుకంటే? నిపుణుల మాటల్లోనే..!

యూపీ ముజఫర్‌నగర్‌లోని చార్తావాల్ స్థానం నుంచి అసెంబ్లీ టికెట్‌ ఆశించారు బీఎస్పీ (బహుజన సమాజ్‌ పార్టీ) నాయకుడు అర్షద్ రాణా. అయితే బీఎస్పీ అధినేత్రి మాయావతి చార్తావాల్ అసెంబ్లీ స్థానం నుంచి సల్మాన్ సయీద్‌ను పోటీకి దింపినట్లు ప్రకటించింది. దీంతో.. ఎమ్మెల్యే టికెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న రాణా కంగుతిన్నారు. టికెట్ దక్కకపోవడంతో కలత చెందారు. టికెట్ల కేటాయింపులో తనకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ కంటతడి పెట్టారు.

రెండేళ్ల క్రితం పార్టీ సీనియర్ నాయకుడు టికెట్ కోసం రూ.67 లక్షలు డిమాండ్ చేశారని ఆయన ఆరోపించారు. తనకు తెలియకుండానే తన టికెట్ కట్ చేశారని కన్నీటి పర్యంతం అయ్యారు. తాను పార్టీ కోసం సర్వస్వం ధారపోస్తున్నానని, అయినా తనకు అవకాశం ఇవ్వకపోగా.. తనను తమాషాగా చూస్తున్నారని వాపోయారు.

Online Shopping : షాకింగ్.. రూ.16వేల ఫోన్ ఆర్డర్ చేస్తే.. అరకిలో రాయి వచ్చింది

తనకు టికెట్ ఇచ్చేందకు పార్టీ నిరాకరించడంతో ఫిర్యాదు చేసేందుకు ఆయన పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఆ సమయంలో కన్నీటిపర్యంతం అయ్యారు. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహుతి చేసుకుంటానని రాణా హెచ్చరించారు. వెక్కి వెక్కి ఏడుస్తున్న అర్షద్ రాణాను పోలీసులు సముదాయించారు. పరేషాన్ కాకండి అంటూ ఆయనను ఓదార్చే ప్రయత్నం చేశారు. కాసేపటి తర్వాత పోలీసులకు ఓ నమస్కారం పెట్టిన అర్షద్ రానా.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు భిన్నంగా స్పందించారు. అయ్యో పాపం, ఆయనకు అన్యాయం జరిగిపోయిందే.. అని కొందరు సానుభూతి చూపితే.. ఈ మాత్రం దానికే అంతగా ఏడ్వాలా? అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. రాజకీయం అన్నాక అలాగే ఉంటుంది, లైట్ తీసుకోవాలి అని మరికొందరు సలహా ఇస్తున్నారు.

×