Buddhadeb Bhattacharya: పద్మభూషణ్‌ నాకొద్దు.. తిరస్కరించిన బుద్ధదేవ్ భట్టాచార్య!

భారత గణతంత్ర దినోత్సవం నాడు పద్మ అవార్డు గ్రహీతల పేర్లను కేంద్రం ప్రకటిస్తూ వస్తుంది.

Buddhadeb Bhattacharya: పద్మభూషణ్‌ నాకొద్దు.. తిరస్కరించిన బుద్ధదేవ్ భట్టాచార్య!

Battacharya

Buddhadeb Bhattacharya: భారత గణతంత్ర దినోత్సవం నాడు పద్మ అవార్డు గ్రహీతల పేర్లను కేంద్రం ప్రకటిస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2021 సంవత్సరానికి కూడా కొందరికి ఈ అవార్డులను ప్రకటించింది. లేటెస్ట్‌గా పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, కమ్యునిస్ట్ నాయకుడు బుద్ధదేవ్ భట్టాచార్యకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది.

అయితే, కేంద్రం ప్రకటించిన ఈ అవార్డును స్వీకరించబోనని బుద్ధదేవ్ భట్టాచార్య స్పష్టం చేశారు. పద్మ అవార్డుల ప్రకటన తర్వాత భట్టాచార్య మాట్లాడుతూ.., “నాకు పద్మవిభూషణ్ వస్తుందని నాకు తెలియదు, ముందుగా నాకు చెప్పలేదు, కానీ నాకు ఈ అవార్డు ఇస్తున్నట్లు ప్రకటించారు, నేను దానిని స్వీకరించడానికి నిరాకరిస్తున్నాను.” అంటూ చెప్పుకొచ్చారు.

ఈ నిర్ణయం రాజకీయాల్లో భాగమే కావచ్చని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బుద్ధదేవ్ భట్టాచార్యను పద్మభూషణ్ అవార్డుతో గౌరవించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురించి కేంద్ర సీనియర్ అధికారి ఆరోజు ఉదయమే ఆయన కుటుంబానికి తెలియజేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. బుద్ధదేవ్ భట్టాచార్య భార్యతో అధికారులు మాట్లాడారని, అవార్డును తిరస్కరించిన సమాచారం కేంద్ర ప్రభుత్వానికి అందలేదని చెబుతున్నారు.

కమ్యూనిస్టు నేత భట్టాచార్యతో పాటు గాయని సంధ్యా ముఖోపాధ్యాయ, తబలా ప్లేయర్ అనింద్య చటోపాధ్యాయ కూడా పద్మ అవార్డులను తిరస్కరించారు. సంధ్యా ముఖోపాధ్యాయ్‌కి 90 ఏళ్లు నిండగా.. ఇప్పుడు పద్మశ్రీ అవార్డు రావడం తమను ఆశ్చర్యానికి గురిచేస్తుందని సంధ్యా ముఖోపాధ్యాయ కుటుంబ సభ్యులు తెలిపారు.

Sonu Nigam : సింగర్ సోనూనిగమ్‌కు పద్మశ్రీ..

ముఖోపాధ్యాయ కంటే చాలా చిన్నవారు చాలామంది ఇప్పటికే పద్మశ్రీ అందుకోగా.. తనదైన రంగంలో ఉన్నత స్థాయికి చేరిన ఓ కళాకారుడికి పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి అవార్డులు రావల్సి ఉందని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ఇవ్వడం బాధాకరమని వారి కుటుంబం అభిప్రాయపడింది.

పద్మ అవార్డులకు ఎంపికైన వ్యక్తులు ఆ అవార్డులను తిరస్కరించడం చాలా అరుదుగా జరుగుతుంది. గతంలో ప్రముఖ గాయని ఎస్.జానకి, బాలీవుడ్ సినీ రచయిత సలీం ఖాన్‌లకు పద్మశ్రీ అవార్డును ప్రకటించగా వారు తిరస్కరించారు.

అలాగే, ప్రముఖ చరిత్రకారిణి రోమిల్లా థాపర్ తనకు 1974లో ప్రకటించిన అవార్డును 2005లో తిరిగిచ్చారు. రచయిత కుష్యంత్ సింగ్ పద్మ భూషణ్‌ను తిరిగిచ్చేసినా 2007లో మళ్లీ పద్మవిభూషణ్‌ను స్వీకరించారు.