UNESCO ఆధ్వర్యంలో రామ జన్మభూమిలో తవ్వకాలు సాగించాలి!

UNESCO ఆధ్వర్యంలో రామ జన్మభూమిలో తవ్వకాలు సాగించాలి!

బౌద్ధ సన్యాసులు అయోధ్యలో నిరసన చేపట్టారు. అయోధ్య జన్మభూమి బౌద్ధులకు చెందిన స్థలమని.. UNESCO దానిని తప్పక తవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయోధ్య జిల్లా మెజిస్ట్రేట్ ఆఫీసు బయట ఆందోళన చేపట్టారు. రామ్ జన్మభూమి అయోధ్యలో ప్రదేశాన్ని లెవల్ చేస్తున్నప్పుడు దొరికిన వస్తువులను పబ్లిక్ గా చూపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

శివలింగ, ఏడు టచ్ స్టోన్ పిల్లర్లు,స ఆరు రెడ్ శాండ్ స్టోన్ పిల్లర్లు, ఓ పువ్వులాంటి పినాకిల్, దేవుళ్లు, దేవతల విరిగిపోయిన విగ్రహాలు మే నెలలో లెవల్ చేస్తుండగా బయటపడ్డాయి. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్(యునెస్కో) దీనిని తవ్వాలంటూ బౌద్య సన్యాసులు డిమాండ్ చేస్తున్నారు. ఆ సమయంలో బయటపడ్డ వస్తువులన్నీ బౌద్ద సంపదకు చెందినవని చెబుతున్నారు.

దాంతో పాటు రాముడి గుడి నిర్మాణాన్ని వెంటనే నిలిపేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయోధ్య అనేది బౌద్ధుల సాకేత్ పురాతన నగరమని, పాత కాలంలో బుద్ధిజం సెంటర్ అని బౌద్ధ అనుచరులు అంటున్నారు.

‘ప్రెసిడెంట్‌కు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు, ఇతర గవర్నమెంట్ ఏజెన్సీలకు అయోధ్య అడ్మినిస్ట్రేషన్ ద్వారా మా విన్నపాలు పంపిస్తాం’ అని అజాద్ బౌద్ధ్ ధర్మ సేన అన్నారు. ‘రాముడి గుడి నిర్మాణం ఒక నెలలోగా ఆగకపోగా, తవ్వకాలకు యునెస్కో అనుమతులు ఇవ్వకపోతే మళ్లీ ఆందోళన చేపడతాం’

‘బౌద్ద నాయకుల నుంచి మాకు మెమరాండం అందింది. దానిని సంబంధిత వ్యక్తులకు పంపిస్తున్నామని ఫైజాబాద్ సిటీ మెజిస్ట్రేట్ ఎస్పీ సింగ్ అన్నారు. మేం మాట ఇవ్వడంతో బౌద్ధ కమ్యూనిటీ ఉపవాస దీక్ష విరమించారు.