Union Budget 2022: మూడేళ్లలో 400 కొత్త వందే భారత్ రైళ్లు

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

Union Budget 2022: మూడేళ్లలో 400 కొత్త వందే భారత్ రైళ్లు

Vb Trains

New Generation Vande Bharat Trains: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ సంధర్భంగా ఆర్థిక మంత్రి మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయ్యిందని, ఈ బడ్జెట్‌లో రాబోయే 25 ఏళ్లకు సంబంధించిన బ్లూప్రింట్ రెడీ చేసినట్లు చెప్పారు. రైల్వే శాఖకు పెద్ద ఎత్తున నిధులు ఇస్తూ ప్రకటన చేశారు. మూడేళ్లలో 400 కొత్తతరం వందేభారత్ రైళ్లను(New Generation Vande Bharat Trains) నడపనున్నట్లు చెప్పారు ఆర్థికమంత్రి.

వచ్చే మూడేళ్లలో మెరుగైన సామర్థ్యంతో 400 కొత్త తరం వందే భారత్ రైళ్లను నడపనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. రాబోయే మూడేళ్లలో 100PM గతి శక్తి కార్గో టెర్మినల్స్(100 PM Gati Shakti Cargo terminals) అభివృద్ధి చేస్తామని, మెట్రో వ్యవస్థను నిర్మించడానికి కొత్త పద్ధతులు అవలంభిస్తామని చెప్పారు.

బడ్జెట్‌లో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చేలా.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 60 లక్షల కొత్త ఉద్యోగాలను ప్రకటించారు. 30 లక్షల అదనపు ఉద్యోగాలు కల్పించే అవకాశం కూడా ఉందని అన్నారు. ఈ బడ్జెట్ వల్ల రైతులు, యువత లబ్ధి పొందుతారని సీతారామన్ అన్నారు. స్వావలంబన భారత్ ద్వారా 16 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు.

బడ్జెట్ ప్రసంగం సందర్భంగా, ఆర్థిక మంత్రి సీతారామన్ మాట్లాడుతూ, ఈ బడ్జెట్ భారత్ రాబోయే 25ఏళ్ల అభివృద్ధికి పునాదియని అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి 9.2 శాతంగా ఉండవచ్చని అంచనా వేశారు. ఇక ఎయిరిండియాలో పెట్టుబడుల ఉపసంహరణ పూర్తయిందని, ఎల్‌ఐసి IPO త్వరలో వస్తుందని ఆర్థికమంత్రి సీతారామన్ చెప్పారు.