Union Budget 2022 : నాల్గోసారి నిర్మలమ్మ బడ్జెట్.. నేడు పార్లమెంట్ ముందుకు..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు పేపర్‌లెస్ యూనియన్ బడ్జెట్ 2022-23 ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మల నాల్గోసారి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు.

Union Budget 2022 : నాల్గోసారి నిర్మలమ్మ బడ్జెట్.. నేడు పార్లమెంట్ ముందుకు..

Budget 2022 Live Updates Fi

Union Budget 2022 : 2022-23 సంవత్సరానికి బడ్జెట్‌ను ఆమోదించేందుకు మంగళవారం (ఫిబ్రవరి 1) ఉదయం 10.10 గంటలకు కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది. కేబినెట్ ఆమోదం పొందిన వెంటనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు పేపర్‌లెస్ యూనియన్ బడ్జెట్ 2022-23 ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు 2021-22లో మొదటిసారి పేపర్‌లెస్ యూనియన్ బడ్జెట్‌ను సమర్పించారు.

ఈసారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఉత్కంఠగా కొనసాగున్నాయి. పార్లమెంట్ ముందుకు కేంద్ర బడ్జెట్ ను తీసుకురానున్నారు నిర్మల సీతారామన్.  నాల్గోసారి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఉదయం 9:30 గంటలకు ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతిని కలవనున్నారు.

బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్రపతికి సమాచారాన్ని ఇవ్వనున్నారు. అనంతరం ఉదయం 10:10 గంటలకు పార్లమెంట్‌లో కేంద్ర కేబినెట్ భేటీ జరుగనుంది. ఈ నేపథ్యంలో 2022-23 వార్షిక బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపనుంది. కేబినెట్ ఆమోదం పొందిన వెంటనే పార్లమెంటు‌లో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈసారి పేపర్‌లెస్‌గా కేంద్ర బడ్జెట్ ఉండనుంది. బడ్జెట్ ప్రసంగాన్ని మొత్తం నిర్మలమ్మ ట్యాబ్ చూసి చదవనున్నారు. అలాగే బడ్జెట్ అంశాలకు సంబంధించి మొత్తం వివరాలను ఎంపీలకు డిజిటల్ రూపంలో అందుబాటలో ఉండనుంది.

నిర్మలాసీతారామన్ బడ్జెట్ ప్రసంగానంతరం రాజ్యసభ కార్యక్రమాలు ప్రారంమవుతాయి. రాజ్యసభకు సైతం మంత్రి బడ్జెట్ సమర్పించనున్నారు. ఫిబ్రవరి 2 నుంచి కోవిడ్ ప్రోటోకాల్స్‌కు అనుగుణంగా లోక్‌సభ, రాజ్యసభ కార్యక్రమాలు రెండు షిఫ్టులుగా జరుగుతాయి. రాజ్యసభ కార్యక్రమాలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ లోక్‌సభ కార్యక్రమాలు కొనసాగించాలని నిర్ణయించారు.

రెండు విడతల బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఫిబ్రవరి 11 వరకూ బడ్జెట్ తొలి విడత సమావేశాలు జరుగనున్నాయి. రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకూ జరగనున్నాయి. ఉభయసభల్లోనూ ప్రధాని నరేంద్ర మోదీ రెండుసార్లు మాట్లాడే అవకాశం ఉంది. అనేక అంశాలపై లేవనెత్తడం ద్వారా విపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పట్టే అవకాశాలు ఉన్నాయి.

Read Also : Today Gold Prices : మహిళలకు గుడ్‌న్యూస్.. తగ్గుతున్న బంగారం.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?