Budget 2023: నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‭లోని హైలైట్స్

పర్యావరణహితమైన కార్యకలాపాలకు తాము పెద్దపీట వేస్తున్నట్లు నిర్మల ప్రకటించారు. అందుకే శిలాజ ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించడానికి గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీని కోసం 35,000 కోట్ల రూపాయలను కేటాయించారు.

Budget 2023: నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‭లోని హైలైట్స్

Budget 2023: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ లోక్ స‌భ‌లో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టారు. వివిధ రంగాలకు భారీ కేటాయింపులతో సర్వత్రా ఆకట్టుకున్నారు. ఆదాయపు పన్ను పరిమితి పెంచడంతో పాటు మరికొన్ని కీలక ప్రకటనలు చేశారు. అవేంటో ఒకసారి చూద్దామా..

ఆదాయపు పన్ను
ఆదాయపు పన్ను పరిమితిని పెంచుతున్నట్లు బుధవారం బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇప్పటి వరకు 5 లక్షల రూపాయలు ఉన్న వ్యయపరిమితిని 7 లక్షల రూపాయలకు పెంచారు. స్టాండర్డ్ డిడ‌క్ష‌న్ రూ.2.5 ల‌క్ష‌ల నుంచి రూ.3 ల‌క్ష‌ల‌కు పెంచారు. నూత‌న ప‌న్నుల విధానం ద్వారా రూ.3లక్షల కంటే త‌క్కువ‌ వార్షిక ఆదాయం ఉన్న వారికి పన్ను ఉండ‌దు.

స్టార్టప్స్
గ్రామీణ ప్రాంతాల్లో స్టార్టప్‌ల కోసం వ్యవసాయ యాక్సిలరేటర్ కింద నిధులు కేటాయిస్తున్నట్లు నిర్మల తెలిపారు. చిన్న అప్పీళ్ల పరిష్కారానికి 100 జాయింట్ కమిషనర్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

బ్యాంకింగ్/ఇన్సూరెన్స్
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్‌ను సెబి (SEBI) పర్యవేక్షిస్తుందట. వివిధ విషయాలపై కంపెనీల దరఖాస్తుల కోసం సెంట్రల్ ప్రాసెసింగ్ కేంద్రం పని చేయనున్నట్లు పేర్కొన్నారు.

గృహరంగం
గృహ నిర్మాణ రంగంలో భారీ పెరుగుదల ఉండనున్నట్లు నిర్మల ప్రకటించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు 79,000 కోట్ల రూపాయలు కేటాయించారు. గతంతో పోలిస్తే ఇది 66 శాతం పెరుగుదల.

సాంఘీక సంక్షేమం
గిరిజనుల కోసం 15,000 కోట్ల రూపాయలు కేటాయించారు. వీటిని ఇంటి సంరక్షణ, సానిటైజేషన్, తాగునీరు, విద్యుత్ వంటి వాటికి ఉపయోగించనున్నారు. అంతే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో 30 ‘స్కిల్ ఇండియా’ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

వ్యవసాయం
రైతులకు ఓపెన్ సోర్స్ కింద డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అందిస్తారు. అంతే కాకుండా 2,516 కోట్లతో 63,000 క్రెడిట్ సొసైటీలను కంప్యూటరీకరించనున్నారు. ఒక కోటి మంది రైతులు సేంద్రీయ వ్యవసాయాన్ని అవలంబించడానికి సహాయం చేయనున్నారు.

విద్య
దేశ వ్యాప్తంగా 157 నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నానరు. సామూహిక ఉపాధ్యాయ శిక్షణ కోసం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నారు. పిల్లల కోసం కొత్త జాతీయ డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయనున్నారు.

వైద్యం
సికిల్ సెల్ అనీమియాను నిర్మూలించే లక్ష్యాన్ని పెట్టుకున్నారు.

పెన్షన్లు
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ 15 లక్షల రూపాయల నుంచి 30 లక్షల రూపాయలకు పెంచారు. నెలవారీ ఆదాయ పథకం పరిమితిని సైతం పెంచారు.

ద్రవ్యలోటు
ద్రవ్యలోటు జీడీపీలో 5.9 శాతంగా ఉంటుందని అంచనా వేశారు.

మౌలిక సదుపాయాలు
మున్సిపాలిటీల్లో ఇక నుంచి పూర్తిగా యంత్రాలతోనే పనులు చేయనున్నట్లు పేర్కొన్నారు. నగరాల్లో మ్యాన్‌హోల్ నుంచి మెషిన్ మోడ్ వరకు 100 శాతం మెకానిజం చేయనున్నారట.

ఎక్సైజ్/కస్టమ్స్ డ్యూటీ
సాధారణ కస్టమ్ డ్యూటీని 21 శాతం నుంచి 13 శాతానికి తగ్గించారు.

ఆర్థికం
2024 ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో మూలధన పెట్టుబడి వ్యయం 3.3 శాతానికి పెరగనుందట. అంతే కాకుండా కేంద్రం ప్రభావవంతమైన మూలధన వ్యయం 13.7 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేశారు.

రైల్వే రంగం
ఈసారి రైల్వే రంగానికి నిధులు బాగానే కేటాయించారు. రైల్వే మంత్రిత్వ శాఖకు 2.4 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు.

పర్యావరణం
పర్యావరణహితమైన కార్యకలాపాలకు తాము పెద్దపీట వేస్తున్నట్లు నిర్మల ప్రకటించారు. అందుకే శిలాజ ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించడానికి గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీని కోసం 35,000 కోట్ల రూపాయలను కేటాయించారు.

డిజిటల్ ఇండియా
వ్యాపారాలు, ఛారిటబుల్ ట్రస్ట్‌ల కార్యకలాపాల్లో ఇక నుంచి డిజిలాకర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. 5జీ సేవలను ఉపయోగించి యాప్‌లను అభివృద్ధి చేయడానికి ఇంజనీరింగ్ సంస్థలలో 100 ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నారు. అగ్రశ్రేణి సంస్థల్లో కృత్రిమ మేధస్సు కోసం 3 అత్యుత్తమ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.