Union Budget 2023-24: జనవరి 31 నుంచి ఏప్రిల్ 6 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమై ఏప్రిల్ 6వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి శుక్రవారం స్పష్టం చేశారు. మొత్తం 66 రోజుల కాలంలో సాధారణ విరామాలతో 27రోజులు సమావేశాలు కొనసాగుతాయని తెలిపారు.

Union Budget 2023-24: జనవరి 31 నుంచి ఏప్రిల్ 6 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

Parlament

Union Budget 2023-24: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమై ఏప్రిల్ 6వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి శుక్రవారం స్పష్టం చేశారు. మొత్తం 66 రోజుల కాలంలో సాధారణ విరామాలతో 27రోజులు సమావేశాలు కొనసాగుతాయని తెలిపారు. ఈ మేరకు ఆయన అధికారిక ట్వీట్ చేశారు.

Union Budget 2023: కీలక మీటింగ్.. 13న ఆర్థికవేత్తలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం..

కేంద్ర బడ్జెట్ రెండు విడతల్లో జరుగుతాయి. జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు తొలి విడత సమావేశాలు జరుగుతాయి. ఇందులో రాష్ట్రపతి ప్రసంగం, ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మాణం ఉంటుంది. దీనితోపాటు ప్రధాన మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రినిర్మలా సీతారామన్ ప్రసంగాలు ఉంటాయి. అనంతరం బడ్జెట్ పై చర్చ జరుగుతుంది. అయితే ఫిబ్రవరి 14 వ తేదీ నుంచి మార్చి 12వ తేదీ వరకు తాత్కాలిక విరామం ఉంటుందని మంత్రి తెలిపారు.

ఈ విరామ సమయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలకు సంబంధించిన విభాగం డిమాండ్‌లను పరిశీలిస్తుందని అన్నారు. నిధులు మంజూరుకోసం సమగ్ర అధ్యయనం చేసి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ గ్రాంట్ల కోసం వచ్చిన డిమాండ్లు పరిశీలిస్తుంది. ఆ నివేదికలనుమంజూరు కోసం వివిధ మంత్రిత్వ శాఖలు, వాటి విభాగాలకు సంబంధించిన నివేదికలను కూడా సిద్ధం చేస్తుంది. మార్చి 12వ తేదీన రెండో విడత బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. ఇందులో ఆయా గ్రాంట్లు ఆమోదం, డిమాండ్లపై చర్చ జరుగుతుంది. కేంద్ర బడ్జెట్ కు ఆమోదం తెలుపుతారు.