బులంద్‌షహర్ సీఐ హత్య కేసు : నిందితులకు పూలదండలతో స్వాగతం

  • Published By: madhu ,Published On : August 26, 2019 / 01:47 AM IST
బులంద్‌షహర్ సీఐ హత్య కేసు : నిందితులకు పూలదండలతో స్వాగతం

సీఐ హత్య చేసిన కేసులో బెయిలుపై వచ్చిన నిందితులకి స్థానికులు పూలమాలలతో ఘన స్వాగతం పలికిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో జరిగింది. గతేడాది డిసెంబరులో బులంద్‌షహర్‌లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వీటిని అదుపు చేసేందుకు వచ్చిన ఎస్సై సుబోధ్ కుమార్ సింగ్ మృతి చెందారు. ఈ ఘటనలో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు బెయిల్‌పై శనివారం విడుదల కాగా… స్థానిక బీజేపీ యూత్ వింగ్ అధ్యక్షుడు శిఖర్ అగర్వాల్, హేము, ఉపేంద్ర రాఘవ్‌లు వారికి పూలదండలతో ఘన స్వాగతం పలికారు. ఊరేగింపుగా తీసుకొచ్చారు. భారత్ మాతాకీ జై, జై శ్రీరాం నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. ఈ ఘటన పలువురిని విస్మయానికి గురిచేసింది.
Read More కారు పంపిన అత్తింటివారు..ఏనుగెక్కిన పెళ్లి కొడుకు… అరెస్ట్
బులంద్‌షహర్ సమీపంలో 2018, డిసెంబర్ 03వ తేదీన 25 ఆవులకు సంబంధించిన కళేబరాలు అటవీ ప్రాంతంలో కనిపించడంతో గోవధ చేశారని వదంతులు వ్యాపించాయి. అల్లరి మూకలు రెచ్చిపోయాయి. హింసాత్మక వాతావరణం కొనసాగింది. నియంత్రించేందుకు స్థానిక ఎస్ఐ సుబోధ్ కుమార్  సింగ్ వెళ్లారు. దాడుల్లో ప్రాణాలు కోల్పోయాడు. దాడి చేసిన వారి వీడియోలు హల్ చల్ చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశించింది. 2019, మార్చిలో 3 వేల 400 పేజీల నివేదిక సమర్పించింది. 38 మందిపై 103 ఛార్జీషీట్ దాఖలు చేసింది. 
Seven accused in Bulandshahr violence, where an inspector was killed by a mob last year, were released on bail recently. The accused including one of the key conspirators Shikhar Agarwal got hero’s welcome amid sloganeering of “Jai Shree Ram” and “Vande Mataram”. pic.twitter.com/iAA122cdU5