మేడ ఎక్కిన ఎద్దు..రచ్చ రచ్చ 

  • Published By: veegamteam ,Published On : March 17, 2019 / 05:19 AM IST
మేడ ఎక్కిన ఎద్దు..రచ్చ రచ్చ 

లక్నో: మేడెక్కి మేసే ఎద్దును చూశావా అనేది ఓ సామెత. ఓ ప్రశ్న. అసలు ఎద్దు మేడ ఎక్కుతుందా..అనేది కూడా పెద్ద ప్రశ్నే. గొడ్ల సావిళ్లలోను..రోడ్లమీద..పొల్లాల్లోను తిరిగే ఎద్దు ఇంటిపైకప్పు ఎక్కి హడావిడి చేసి నానా హంగామా చేసిందంటే నమ్ముతామా? నమ్మనే నమ్మం కదూ? కానీ ఈ బసవన్న మేడ ఎక్కటమే కాక అక్కడ చేసిన రచ్చ మామూలుగా లేదు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో   ఇటువంటి విస్తుపోయే ఘటన చోటుచేసుకుంది. ఆలమ్‌బాగ్‌లోని ఆదర్శనగర్ ప్రాంతానికి చెందిన తైరాన్‌కు ఈ వింత అనుభవం ఎదురైంది. ఉదయం లేవగానే ఇంటిపై కప్పుపై ఒక ఎద్దు అంబా అని అరుస్తూ కనిపించింది. దీంతో అక్కడికి వెళ్లాడు..అక్కడ పరిస్థితి చూసాడు..మేడైతే ఎక్కింది కానీ ఆ బసవడికి ఏం చేయాలో అర్థం కాలేదు..కిందికి ఎలా దిగాలో అర్థం కాలేదో ఏమో..అక్కడ చక్కగా అమర్చిన పూలకుండీలన్నీంటినీ  ధ్వంసం చేసేసింది. ఇది తెలిసి మేడ ఎక్కిన ఎద్దును చూసేందుకు ఆ చుట్టు ప్రక్కలవాంతా చేరుకుని వింతగా తిలకించారు. 

ఈ సమాచారం అందుకున్న మున్సిపల్ సిబ్బంది ఎద్దును సురక్షితంగా కిందకు దించేందుకు వచ్చారు. మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఎద్దు స్పృహ కోల్పోయేలా చేసి..ఎట్టకేలకు బసవన్నను చక్కగా కిందికి తరలించారు.