Bulldozer Action: మహిళను తిట్టిపోసిన బీజేపీ లీడర్‌పై బుల్డోజర్ అటాక్

నోయిడా హౌజింగ్ సొసైటీలోని పొలిటీషియన్ ఇంటిపై బుల్డోజర్ అటాక్ చేసింది. బీజేపీ కిశాన్ మోర్చాకు చెందిన శ్రీకాంత్ త్యాగి ఓ మహిళతో వాదులాడటమే కాకుండా కించపరిచే విధంగా ప్రవర్తించారు. అంతే, ఇక బుల్డోజర్ యాక్షన్ కమిటీ రంగంలోకి దిగింది.

Bulldozer Action: మహిళను తిట్టిపోసిన బీజేపీ లీడర్‌పై బుల్డోజర్ అటాక్

bulldozer attack

 

 

Bulldozer Action: నోయిడా హౌజింగ్ సొసైటీలోని పొలిటీషియన్ ఇంటిపై బుల్డోజర్ అటాక్ చేసింది. బీజేపీ కిశాన్ మోర్చాకు చెందిన శ్రీకాంత్ త్యాగి ఓ మహిళతో వాదులాడటమే కాకుండా కించపరిచే విధంగా ప్రవర్తించారు. అంతే, ఇక బుల్డోజర్ యాక్షన్ కమిటీ రంగంలోకి దిగింది. నోయిడాలోని గ్రాండ్ ఒమాక్సె సొసైటీలోని సెక్టార్-93బీకి పోలీసులతో పాటు అధికారులు చేరుకున్నారు.

శ్రీకాంత్ త్యాగికి చెందిన అక్రమ కట్టడాలను తొలగించారు. త్యాగి సపోర్టర్లను పోలీసులు చెదరగొట్టారు. మహిళకు.. త్యాగికి మధ్య వాదనకు తెరదీసిన సపోర్టర్లపై యాక్షన్ తీసుకున్నారు. అంతేకాకుండా త్యాగిపై గ్యాంగ్‌స్టర్ చట్టం కింద కేసు నమోదు చేశారు.

కొద్ది రోజుల క్రితం గ్రాండ్ ఒమాక్సె సొసైటీలో మహిళకు, త్యాగికి మధ్య గొడవ జరిగింది. త్యాగి మొక్కలను నాటాలనుకోగా నిబంధనలు ఉల్లంఘించారంటూ మహిళ వ్యతిరేకించింది. త్యాగి అలా చేయడానికి తనకు హక్కు ఉందని వాదించడంతో గొడవ పెద్దదైంది. మహిళపై దుర్భాషలాడటం, దాడి చేయడం వంటివి చేశారు.

Read Also: యోగి హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. క్షణాల్లో అప్రమత్తమైన అధికారులు

తాను బీజేపీ కిసాన్ మోర్చా సభ్యుడినని చెప్పుకున్నప్పటికీ పార్టీ ఏ మాత్రం వెనకేసురాకుండా బీజేపీ దూరంగా ఉండిపోయింది. శ్రీకాంత్ త్యాగి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ధన్యవాదాలు తెలిపారు బీజేపీ ఢిల్లీ అధికార ప్రతినిధి ఖేమ్‌చంద్ శర్మ.