Uttarakhand : ఉత్తరాఖండ్‌లో వరద బీభత్సం.. కొట్టుకుపోయిన బస్సులో 20 మంది ప్రయాణికులు చివరికి..

ఉత్తరాఖండ్ లో వర్షాలు, వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. తాజాగా ఓ బస్సు వరదనీటిలో కొట్టుకుపోతుంటే అలర్టైన అధికారులు ప్రయాణికులను ప్రాణాలతో కాపాడారు. ఇక నిలుపుదల లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా స్ధానిక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.

Uttarakhand : ఉత్తరాఖండ్‌లో వరద బీభత్సం.. కొట్టుకుపోయిన బస్సులో 20 మంది ప్రయాణికులు చివరికి..

Uttrakhand floods

Uttarakhand : ఉత్తరాఖండ్ (Uttrakhand) భారీ వర్షాలు (flood), వరదలో వణికిపోతోంది. కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి (heavy rains) నదులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. తాజాగా వరద బీభత్సానికి ప్రయాణికులతో (passengers) ఉన్న బస్సు కొట్టుకుపోతుంటే అలర్టైన అధికారులు వారి ప్రాణాలు కాపాడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

flood In US : ప్రకృతి కన్నెర్ర..అప్పుడు మంచు ఇప్పుడు వరదలతో వణుకుతున్న అమెరికా.. వరదలతో కాలిఫోర్నియా, లాస్ఏంజిల్స్ అతలాకుతలం

ఉత్తరాఖండ్ తేధా గ్రామం (Tedha) టిల్మత్ (Tilmath) దేవాలయానికి సమీపంలో వరద ముంచెత్తింది.  20 మంది ప్రయాణికులతో అటుగా వెళ్తున్న బస్సు భారీ వరదనీటిలో చిక్కుకుపోయింది. బస్సు వరద ప్రవాహంలో కొట్టుకుపోతుంటే ప్రయాణికులు హడలిపోయారు. అయితే అప్పటికే అక్కడ అప్రమత్తంగా ఉన్న ప్రభుత్వ (administration), పోలీస్ యంత్రాంగం (police department) వారందరినీ ప్రాణాలతో కాపాడింది. కొద్దిరోజుల క్రితమే అక్కడ వాతావరణ శాఖ వర్షాలు, వడగళ్ల వానపై సమాచారం ఇవ్వడంతో వరద ముప్పు పొంచి ఉన్న ప్రాంతాలను అధికారులు గుర్తించారు. ఆ ప్రాంతాల వద్ద గట్టి చర్యలు చేపట్టారు. ఇక వడగళ్ల వాన కారణంగా నైనిటాల్ లో (Nainital) అత్యల్ప ఉష్ణోగ్రతలు (temperature) నమోదయ్యాయి.

Melting Himalayas ..Pakistan Floods : రికార్డు స్థాయిలో హిమాలయాలో కరిగిపోవటం వల్లే పాకిస్థాన్‌లో వరదలు వచ్చాయంటున్న పరిశోధకులు

మరోవైపు భారీ వర్షాలు, వరదలతో ఉత్తరాఖండ్ అతలాకుతంగా ఉంది. స్ధానికంగా ఉండే ప్రజలు బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. మరోవైపు ఈ ప్రాంతాలను చూడటానికి దూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన టూరిస్టుల (tourists)  పరిస్థితి దయనీయంగా మారింది. ఎక్కడికి వెళ్లలేని పరిస్థితిల్లో ఇక్కడ చిక్కుకుపోయారు.